భయ్యా నీ వయసు పెరుగుతోంది, జుట్టూ ఊడుతోంది... బర్త్ డే విషెస్ చెప్పిన రిషబ్ పంత్‌కి షమీ రివర్స్ పంచ్...

First Published Sep 5, 2021, 6:57 PM IST

టీమిండియాలో యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మహా తుంటరి. మాజీ కెప్టెన్ మాహేంద్ర సింగ్ ధోనీతో, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మతో రిషబ్ పంత్ పరాచకాలు ఆడుతూ, ఆటపటిస్తూ ఉండడం చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మహ్మద్ షమీకి పంచ్ వేయబోయి, రివర్స్‌లో తానే బుక్ అయ్యాడు రిషబ్ పంత్...

భారత జట్టుకి మూడు ఫార్మాట్లలో కీలకం మారిన బౌలర్లలో మహ్మద్ షమీ ఒకడు. లార్డ్స్ టెస్టులో బాల్‌తో పాటు బ్యాటుతోనూ రాణించి, అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు మహ్మద్ షమీ...

రొటేషన్ పాలసీ ప్రకారం శార్దూల్ ఠాకూర్‌కి తుది జట్టులో చోటు దక్కడంతో నాలుగో టెస్టు నుంచి మహ్మద్ షమీకి విశ్రాంతి దొరికింది. నవంబర్ 3న మహ్మద్ షమీ 31వ పుట్టినరోజు...

స్టేడియంలో అభిమానులు తీసుకొచ్చిన కేక్‌ను కట్ చేసి, బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు మహ్మద్ షమీ. కోవిద్ నిబంధనలు అమలులో ఉన్నా, అభిమానులను నిరాశపర్చడం ఇష్టం లేక కేక్ కట్ చేస్తూ, ఫోటోలు దిగాడు...

షమీకి తన స్టైల్‌లో బర్త్ డే విషెస్ చెప్పాలని భావించిన రిషబ్ పంత్... ‘షమీ భాయ్... వయసు పెరుగుతోంది, నెత్తి మీద గుండు కూడా అంతే వేగంగా పెరుగుతోంది... హ్యాపీ బర్త్ డే...’ అంటూ ఫన్నీ ఎమోజీలను జత చేశాడు... (భాయ్, బాల్ ఔర్ ఉమర్ దోనో తేజీ సే నిక్లీ జా రహీ హై...)

దానికి రివర్స్ పంచ్ ఇస్తూ ‘నీ టైం కూడా వస్తుంది బేటా... వయసునీ, బట్టతలనీ ఎవ్వరూ ఆపలేరు. కానీ పొట్ట తగ్గించుకోవడానికి ట్రీట్‌మెంట్ కావాలంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు...’ (అప్నా టైం ఆయేగా బేటా, బాల్ ఔర్ ఉమర్ కో కోయీ నహీ రుక్ సక్తా బట్ మోటాపే కా ట్రీట్‌మెంట్ ఆజ్ బీ హోతా హై) అంటూ రిప్లై ఇచ్చాడు...

బట్టతల పెరుగుతోందంటూ తనని ట్రోల్ చేయబోయిన రిషబ్ పంత్‌కి ముందు నువ్వు పొట్ట తగ్గించుకో.. అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు మహ్మద్ షమీ...

రిషబ్ పంత్‌కి ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎవ్వరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, భార్యకు దూరంగా ఉంటున్న పెళ్లైన బ్రహ్మాచారితో పెట్టుకోకూడదని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు...

ఐపీఎల్ 2020 సీజన్‌కి ముందు ఓవర్‌ వెయిట్‌తో దాదాపు జట్టుకి దూరమైన రిషబ్ పంత్, కరోనా కారణంగా దొరికిన బ్రేక్‌ను సరిగ్గా ఉపయోగించుకుని, బరువు కాస్త తగ్గించుకున్నాడు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన రిషబ్ పంత్, ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టూర్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి టీమిండియాలో కీ ప్లేయర్‌గా మారిపోయాడు... 

click me!