స్పోర్ట్స్ టీచర్‌ హాట్‌గా ఉంటుందని క్రికెట్ ఆడడం మొదలెట్టా... డ్వేన్ బ్రావో షాకింగ్ కామెంట్...

First Published Sep 5, 2021, 5:55 PM IST

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన బ్రావో... చాలా పార్టీ పర్సన్. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటున్న డ్వేన్ బ్రావో... కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు...

సీపీఎల్‌ 2021 సీజన్‌లో సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ ప్యాట్రియట్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డ్వేన్ బ్రావో, డుప్లిసిస్ కెప్టెన్సీలోని సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘వీ ఆర్ చెన్నై సూపర్ కింగ్స్ బాయ్స్’ అంటూ కామెంట్ చేసి, ఇండియన్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు...

టీ20 ఫార్మాట్‌లో గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న డ్వేన్ బ్రావో... నిజానికి తన చిన్నతనంలో క్రికెటర్ కావాలని అనుకోలేదట.. కేవలం స్పోర్ట్స్ టీచర్ కారణంగా ఆటలు ఆడడం మొదలెట్టాడట..

‘నేనెప్పుడూ క్రికెటర్‌ కావాలని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సింగర్ కావాలని కలలు కన్నాను. అయితే మా స్పోర్ట్స్ టీచర్ చాలా హాట్‌గా ఉండేది. ఆమెను రోజు చూడొచ్చనే ఉద్దేశంతోనే క్రికెట్ ఆడడం మొదలెట్టా’ అంటూ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు డ్వేన్ బ్రావో...

తన కెరీర్‌లో 40 టెస్టులు, 164 వన్డేలు, 86 టీ20 మ్యాచులు ఆడిన డ్వేన్ బ్రావో... ఓవరాల్‌గా 6 వేలకు పైగా పరుగులు, 350+ పైగా వికెట్లు పడగొట్టి, విండీస్‌కి స్టార్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు...

డ్వేన్ బ్రావోకి ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక్కో ఐపీఎల్‌ సీజన్‌కి బ్రావో ఒక్కో గర్ల్ ఫ్రెండ్స్‌తో వస్తుంటాడని, అతనికి వాళ్లతో పిల్లలు కూడా ఉన్నారని సీఎస్‌కే బౌలర్ దీపక్ చాహార్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. 

క్రికెటర్‌గా మారినా పాటల మీద ఉన్న ఆసక్తితో కొన్ని ఆల్బమ్స్ కూడా చేశాడు డ్వేన్ బ్రావో. కొందరు బాలీవుడ్ భామలతో కూడా స్టెప్పులేసిన బ్రావో, డీజే బ్రావోగా పేరు తెచ్చుకున్నాడు.

click me!