Shane Warne: ఐపీఎల్ తొలి సీజన్ విన్నింగ్ కెప్టెన్ మృతి.. రాజస్థాన్ రాయల్స్ కు తీరని లోటు..

Published : Mar 04, 2022, 09:23 PM IST

Shane Warne Passes Away: త్వరలో ఐపీఎల్-15 ప్రారంభం కానున్నది.  ఇప్పటివరకు 14 ఐపీఎల్  సీజన్ లు ముగియగా.. తొలి సీజన్ లో విజేత మాత్రం రాజస్థాన్ రాయల్స్. ఆ సీజన్  లో రాజస్థాన్ కు కెప్టెన్ గా వ్యవహరించిన వార్న్... 

PREV
17
Shane Warne: ఐపీఎల్ తొలి సీజన్ విన్నింగ్ కెప్టెన్ మృతి.. రాజస్థాన్ రాయల్స్ కు తీరని లోటు..

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ మరణంతో క్రికెట్ ప్రపంచం షాక్ కు గురైంది. ఇక ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కైతే ఈ వార్త నిజంగా  ఊహించని షాకే.. 

27

ఐపీఎల్  తో వార్న్ కు ప్రత్యేక అనుబంధం ఉంది.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి విజేత రాజస్థాన్ రాయల్స్ కాగా.. ఆ జట్టుకు సారథిగా వ్యవహరించింది  వార్నే కావడం  గమనార్హం. సీనియర్లు, యువ ఆటగాళ్లను కలుపుకుని పోయిన ఆయన కెప్టెన్సీ.. రాజస్థాన్ కు తొలి కప్ ను అందించింది. 

37

అసలు అంచనాలే లేని స్థితి నుంచి ఆ జట్టును ఛాంపియన్ గా నిలపడంలో  వార్న్  పాత్ర ఎంతో ఉంది. గ్రూప్ స్టేజీలోనే ఆ జట్టు దుమ్ముదులిపింది.  ఫైనల్ దాకా వచ్చిన  రాజస్థాన్.. తుది పోరులో  హేమా హేమీ ఆటగాళ్లు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడింది. 
 

47

ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు  చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. మూడు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని సాధించి విజయాన్ని అందుకున్నది.  దీంతో ఐపీఎల్ తొలి ట్రోఫీని రాజస్థాన్ సగర్వంగా తలకెత్తుకుంది. 

57

ఆ తర్వాత రాజస్థాన్ మళ్లీ కప్ కొట్టలేదు.   అంతర్జాతీయ కెరీర్  నుంచి తప్పుకున్న  వార్న్.. కొద్దికాలం పాటు రాజస్థాన్ కు మెంటార్ గా కూడా వ్యవహరించాడు. నిన్నామొన్నటిదాకా కూడా అతడు రాజస్థాన్ కు సంబంధించిన విషయాల మీద ఆసక్తిగా తెలుసుకునేవాడు. 

67

కాగా.. ఐపీఎల్ లో తమ తొలి కెప్టెన్ హఠన్మారణంతో  రాజస్థాన్ షాక్ కు గురైంది. అతడి మరణవార్త విన్న అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘లేదు.. ఇలా కాకుండా ఉండాల్సింది..’అని ట్వీట్ చేసింది.  

77

రాజస్థాన్ తో పాటు  ఐపీఎల్ లోని  ఇతర జట్లు కూడా తమ సోషల్ మీడియా ఖాతాలలో  వార్న్ మృతికి సంతాపం తెలుపుతున్నాయి.  అతడి ఆత్మకు శాంతి చేకూరాలని రాస్తూ.. వార్న్ కుటుంబానికి  ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాయి. ఈ సందర్భంగా అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నాయి. 

click me!

Recommended Stories