IPL 2022: ఐపీఎల్ షెడ్యూల్ విడుదలకు ముహుర్తం ఖరారు చేసిన బీసీసీఐ.. ఎప్పుడంటే..?

Published : Mar 04, 2022, 05:00 PM IST

IPL 2022 Schedule: ఈ నెల 26 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కాబోయే  ధనాధన్ ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన షెడ్యూల్  విడుదలపై బీసీసీఐ కీలక ప్రకటన చేయనున్నది. 

PREV
110
IPL 2022: ఐపీఎల్ షెడ్యూల్ విడుదలకు ముహుర్తం ఖరారు చేసిన బీసీసీఐ.. ఎప్పుడంటే..?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న మెగా టోర్నీ  ఇండియన్ ప్రీమియర్  లీగ్ (ఐపీఎల్)-2022 సీజన్ కు సమయం దగ్గరపడుతున్నది.  మార్చి 26 నుంచి  మహారాష్ట్ర వేదికగా మొదలుకాబోయే ఈ సీజన్ కు సంబంధించిన కీలక అప్డేట్ వెలువడింది. 

210

ఇప్పటికే ఐపీఎల్ వేలం, మ్యాచులు నిర్వహించే వేదికలు ఖరారైన నేపథ్యంలో ఇక మిగిలింది షెడ్యూల్ ఒక్కటే.. అది కూడా విడుదల చేస్తే బీసీసీఐ.. ఇక మ్యాచుల నిర్వహణ మీద ఫోకస్ పెట్టనుంది.  

310

అయితే  వచ్చే ఆదివారం (మార్చి 6న) ఐపీఎల్-15 కు సంబంధించిన పూర్తి షెడ్యూల్,  మ్యాచుల వివరాలను  బీసీసీఐ ప్రకటించనుందని  జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

410

ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ... ‘దానిని (ఐపీఎల్-15 షెడ్యూల్ ను) ఆదివారం విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకా కొన్ని విషయాల మీద చర్చ జరుగుతున్నది.  ఈసారి మ్యాచులు 25 శాతం మంది ప్రేక్షకుల మధ్య నిర్వహించడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. 

510

అయితే దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో  ఈ సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉంది. తొలి అంచె ఐపీఎల్ పూర్తయిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటాం..’ అని చెప్పారు. 

610

ముంబై లోని వాంఖడే,  బ్రబోర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియాలతో పాటు పూణెలోని  ఎంసీఏ స్టేడియంలో కూడా  ఐపీఎల్ లీగ్ దశ మ్యాచులు (70) నిర్వహించేందుకు బీసీసీఐ ఇప్పటికే  షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్టు సమాచారం.  

710

అయితే ప్లే ఆఫ్స్ ఎక్కడ నిర్వహిస్తారనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. బీసీసీఐ లోని పలు వర్గాలు చెబుతున్నదాని ప్రకారం.. ప్లేఆఫ్స్ ను  అహ్మదాబాద్ లో 50 శాతం ప్రేక్షకుల  మధ్య నిర్వహించనున్నారని వార్తలు వస్తున్నాయి. 
 

810

ఇదే విషయమై సదరు  అధికారి మాట్లాడుతూ.. ‘ప్లే ఆఫ్స్ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుంది. మేం కూడా దాని మీద ఆలోచిస్తున్నాం.  ప్లే ఆఫ్స్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తాం..’ అని తెలిపారు. 

910

ఇదిలాఉండగా.. కరోనా కేసులు, ఉధృతి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విదేశీ ఆటగాళ్ల క్వారంటైన్ నిబంధనలను కూడా సవరించనున్నట్టు సమాచారం.  

1010

ఐపీఎల్ లో ఆడేందుకు వచ్చే  విదేశీ ఆటగాళ్లు  బయో బబుల్ లో ఎంటర్ అవడానికి ముందు  ఐదు రోజులు క్వారంటైన్ లో ఉండాలని బీసీసీఐ గతంలో  ఆదేశించింది.  అయితే దీనిని ఇప్పుడు మూడు రోజులకే కుదించనున్నట్టు తెలుస్తున్నది. పై విషయాలకు సంబంధించిన వివరాలన్నీ ఆదివారం వెల్లడవుతాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

click me!

Recommended Stories