చేయాల్సిదంతా విరాట్ చేసేశాడు, రోహిత్ శర్మకు కెప్టెన్సీ కష్టమేమీ కాదు... గంభీర్ కామెంట్స్...

Published : Mar 04, 2022, 03:53 PM IST

టీమిండియా నయా సారథి రోహిత్ శర్మకు తిరుగులేని ఆరంభం దక్కింది. టీ20, వన్డేల్లో వరుసగా మ్యాచులు గెలుస్తూ, ప్రత్యర్థులను వైట్ వాష్ చేస్తూ దూసుకుపోతున్న రోహిత్, లంకతో మొహాలీ టెస్టు ద్వారా టెస్టు సారథిగా ఆరంగ్రేటం చేశాడు...

PREV
110
చేయాల్సిదంతా విరాట్ చేసేశాడు, రోహిత్ శర్మకు కెప్టెన్సీ కష్టమేమీ కాదు... గంభీర్ కామెంట్స్...

కెప్టెన్‌గా ఆడిన తొలి టీ20 సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రోహిత్ శర్మ, ఆ తర్వాత బ్యాటుతో ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...

210

అయితే టెస్టు కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవడం రోహిత్ శర్మకు పెద్ద కష్టమేమీ కాదంటున్నాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

310

‘నాకు తెలిసి రోహిత్‌కి టెస్టు కెప్టెన్సీ కష్టమేమీ కాదు. ఎందుకంటే రెడ్ బాల్ క్రికెట్‌లో ఇప్పటికే టీమిండియా చాలా మంచి పొజిషన్‌లో ఉంది...

410

ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే గురించి మాట్లాడితే వారి స్థానంలో హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్ లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు... 

510

అయ్యర్ ఆరంగ్రేటం నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. అదీకాకుండా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు...

610

టెస్టు మ్యాచులను గెలిపించగల బౌలర్లు ఇప్పటికే జట్టులో ఉన్నారు. విరాట్ కోహ్లీ భారత బౌలింగ్ విభాగాన్ని అత్యంత పటిష్టంగా మార్చాడు...

710

కాబట్టి విరాట్ నిర్మించిన జట్టును రోహిత్ శర్మ నడిపిస్తే చాలు. విదేశాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా రోహిత్ టీమ్ ఎలా స్పందిస్తుందనేది చూడాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..
 

810

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు 69 మ్యాచుల్లో 40 టెస్టు విజయాలు అందుకుంది. భారత జట్టుకి అత్యధిక విజయాలు అందించిన టెస్టు సారథిగా టాప్‌లో నిలిచాడు విరాట్...

910

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించి టెస్టు సిరీస్ గెలిచిన విరాట్ సేన, ఇంగ్లాండ్‌లోనూ టెస్టు సిరీస్ గెలిచింది...  

1010

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో గత ఏడాది ఇంగ్లాండ్‌లో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడిన భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఆఖరి టెస్టు రోహిత్ కెప్టెన్సీలో ఈ ఏడాది జూన్‌లో జరగనుంది.

Read more Photos on
click me!

Recommended Stories