ఫైనల్‌లో స్పిన్నర్‌ లేకపోవడం ఏంటి? ఇదేం గేమ్ ప్లాన్... న్యూజిలాండ్‌ను ప్రశ్నించిన షేన్ వార్న్...

First Published Jun 19, 2021, 8:55 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు, న్యూజిలాండ్ మధ్య హోరాహోరీ ఫైట్ అయితే సాగుతోంది. బ్యాడ్ లైట్ కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది..

ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఇద్దరు స్పిన్నర్ల (రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా)తో బరిలో దిగగా, న్యూజిలాండ్ మాత్రం తన టీమ్‌లో స్పిన్నర్‌కి అవకాశం ఇవ్వలేదు. నలుగురు పేసర్లు, ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో బరిలో దిగింది న్యూజిలాండ్...
undefined
‘న్యూజిలాండ్ జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో స్పిన్నర్‌ను ఆడించకపోవడంనిరుత్సాహపరిచింది. ఇప్పటిక పిచ్ మీద చాలా ఫుట్ మార్క్ కనిపిస్తున్నాయి. చూస్తుంటే స్పిన్నర్లకు అనుకూలించేలా ఉంది....
undefined
టీమిండియా 275 నుంచి 300 పరుగులకు పైగా చేస్తే, ఫైనల్ ఫలితం తేలడం ఖాయం. అదే జరిగితే న్యూజిలాండ్‌ను వాతావరణమే కాపాడాలి...’ అంటూ ట్వీట్ చేశాడు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం, మాజీ క్రికెటర్ షేన్ వార్న్...
undefined
తొలిరోజు వర్షం కారణంగా రద్దు కావడంతో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించదని క్రికెట్ విశ్లేషకులు భావించారు. టీమిండియాలో జడేజాని తప్పించి, అతని స్థానంలో సిరాజ్‌ను ఆడిస్తారని టాక్ వినిపించింది.. అయితే కోహ్లీ మాత్రం జడ్డూ, అశ్విన్‌లను ఆడించడానికే మొగ్గు చూపాడు...
undefined
‘జడేజా, అశ్విన్ వరల్ట్ క్లాస్ స్పిన్నర్లు. వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో అయినా వికెట్లు తీయగలరు. అందుకే మేం ఇద్దరినీ ఆడించాలని నిర్ణయించుకున్నాం...’ అంటూ టాస్ అనంతరం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ..
undefined
అయితే టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన షేన్ వార్న్‌కి ఓ నెటిజన్‌కి కౌంటర్ ఇచ్చిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది...
undefined
‘షేన్... స్పిన్ ఇక్కడ వర్కవుట్ అవుతుందని ఎలా అనుకుంటున్నావు? పిచ్ కాస్త ఆరితేనే స్పిన్‌కి అనుకూలిస్తుంది. కాని ఇక్కడ వర్షం పడుతోంది, కాబట్టి పిచ్ ఇలాగే ఉంటుంది’ అంటూ షేన్ వార్న్ ట్వీట్‌కి కామెంట్ చేశాడు మక్కా అనే కుర్రాడు. లెజెండ్‌కే స్పిన్ గురించి సలహా ఇచ్చిన ఈ కుర్రాడి ట్వీట్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...
undefined
click me!