ICC WTC Final: మేఘావృత్తమైన ఆకాశం... ఆటను నిలిపివేసి, టీ బ్రేక్ ఇచ్చిన అంపైర్లు...

First Published Jun 19, 2021, 8:00 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి వాతావరణం మరోసారి అంతరాయం కలిగించింది. 55.3 ఓవర్లు ముగిసిన తర్వాత వాతావరణంలో మార్పులు రావడం, వెలుతురు మందగించడంతో ఆటను నిలిపివేసి, టీ బ్రేక్ ప్రకటించారు అంపైర్లు...

సౌంతిప్టన్‌లో రెండోరోజు కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. లోకల్ టైం 3 గంటలు దాటిన తర్వాత మబ్బులతో నిండడంతో నిర్దిష్ట సమయం కంటే ముందుగానే టీ బ్రేక్‌కి వెళ్లింది భారత జట్టు...
undefined
టీ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది భారత జట్టు. లంచ్ బ్రేక్ తర్వాత 54 బంతుల్లో 8 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా వికెట్ కోల్పోయింది టీమిండియా...
undefined
88 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింకా రహానే కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు...
undefined
అజింకా రహానే 54 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 94 బంతుల్లో ఓ ఫోర్‌తో 35 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 92 బంతుల్లో 32 పరుగులు జోడించారు...
undefined
రోహిత్ శర్మ 34 పరుగులు, శుబ్‌మన్ గిల్ 28 పరుగులు చేసి అవుట్ కాగా న్యూజిలాండ్ బౌలర్లలో కేల్ జెమ్మీసన్, నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్‌లకు తలా ఓ వికెట్ దక్కింది...
undefined
టీమిండియా తరుపున టెస్టుల్లో నాలుగో స్థానంలో 6 వేల పరుగులు పూర్తిచేసుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (13492 పరుగులు) తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
undefined
టెస్టుల్లో 7500 పరుగులు కూడా పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, 154 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ (144 ఇన్నింగ్స్‌లు), రాహుల్ ద్రావిడ్ (148), తర్వాత అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కోహ్లీ...
undefined
ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ ఇంగ్లాండ్‌లో 600+ పరుగులు చేయగా, ఎమ్మెస్ ధోనీ (569 పరుగులు), అజారుద్దీన్ (468), ఏంజెలో మాథ్యూస్ (431), ఇమ్రాన్ ఖాన్ (403) పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
undefined
click me!