బాబర్ ఆజమ్‌కి షాక్... పాకిస్తాన్‌ కెప్టెన్‌గా షాన్ మసూద్‌! త్వరలో ప్రకటన...

First Published Jan 13, 2023, 5:09 PM IST

పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజమ్‌పై వేటు పడనుందా? ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో స్వదేశంలో ఆడిన ఒక్క టెస్టులోనూ విజయం అందుకోలేకపోయింది పాకిస్తాన్...

17 ఏళ్ల తర్వాత తొలిసారి స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడింది పాకిస్తాన్. ఆ తర్వాత న్యూజిలాండ్‌తోనూ టెస్టు సిరీస్ ఆడింది. ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల్లోనూ ఓడిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టెస్టులను డ్రాగా ముగించి సరిపెట్టుకుంది...

Babar Azam

పీసీబీ అధ్యక్షుడిగా రమీజ్ రాజాని తప్పించి, నజీం సేథికి బాధ్యతలు అప్పగించింది. అధ్యక్షుడితో పాటు సెలక్టర్లపై కూడా వేటు వేసిన పాకిస్తాన్, కెప్టెన్‌ని కూడా మార్చాలని భావిస్తోంది. పాక్‌కి విజయాలు అందించలేకపోతున్న బాబర్ ఆజమ్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..

బాబర్ ఆజమ్ స్థానంలో వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన షాన్ మసూద్‌కి టెస్టు, వన్డే కెప్టెన్సీ ఇవ్వాలని పీసీబీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టీ20లో మాత్రం బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా కొనసాగుతాడని టాక్...

Babar Azam

బాబర్ ఆజమ్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో మొట్టమొదటిసారి ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో భారత్‌పై విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. ఎన్నో ఏళ్లుగా ఐసీసీ టోర్నీలో భారత్ చేతిలో ఓడుతూ వస్తున్న పాక్, 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీలో వరుసగా ఐదు విజయాలు అందుకుని, టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరింది పాకిస్తాన్... మొట్టమొదటిసారిగా సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్‌ గెలిచింది పాకిస్తాన్...

20 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచింది పాకిస్తాన్. ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఫైనల్ చేరిన పాకిస్తాన్, టైటిల్ సాధించలేకపోయింది. రెండు టోర్నీల్లోనూ రన్నరప్‌గా నిలిచింది బాబర్ ఆజమ్ టీమ్.. 

click me!