జడేజా, చాహాల్ వద్దు! వన్డే వరల్డ్ కప్‌కి ఆ నలుగురు స్పిన్నర్లే బెస్ట్ - గౌతమ్ గంభీర్...

First Published Jan 13, 2023, 2:57 PM IST

వైట్ బాల్‌ ఫార్మాట్‌లో టీమిండియాకి ప్రధాన స్పిన్నర్‌గా ఉంటూ వస్తున్నాడు యజ్వేంద్ర చాహాల్. అయితే గత రెండు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో యజ్వేంద్ర చాహాల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. శ్రీలంకతో సిరీస్‌లోనూ రెండో వన్డేలో తుదిజట్టులో చోటు కోల్పోయాడు యజ్వేంద్ర చాహాల్...

తొలి వన్డేలో 10 ఓవర్లలో 58 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీసిన యజ్వేంద్ర చాహాల్, రెండో వన్డేలో ఆడలేదు. చాహాల్ గాయపడడం వల్లే కుల్దీప్ యాదవ్‌ని తుదిజట్టులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించాడు కెప్టెన్ రోహిత్ శర్మ...

గాయం కారణంగా ఆరు నెలలుగా టీమ్‌కి దూరంగా ఉన్న రవీంద్ర జడేజా, ఎప్పుడు కమ్‌బ్యాక్ ఇస్తాడో తెలియడం లేదు. అయితే ఈ ఇద్దరినీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి దూరంగా పెట్టడమే బెటర్ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

‘కుల్దీప్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చిన ప్రతీసారీ తన విలువేంటో నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇకనైనా అతనికి వరుస అవకాశాలు ఇవ్వాలి. టీమ్ కాంబినేషన్ పేరుతో కుల్దీప్ యాదవ్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు...

Jadeja and Axar

కుల్దీప్ యాదవ్‌తో పాటు రవిభిష్ణోయ్ కూడా ఎలాంటి పిచ్‌ మీద అయినా వికెట్లు తీయగలనని నిరూపించుకున్నాడు. ఈ ఇద్దరితో పాటు స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు వరుస అవకాశాలు కల్పించాలి...

Image credit: Getty

స్వదేశీ పిచ్‌లపై అక్షర్ పటేల్‌కి చాలా మంచి రికార్డు ఉంది. అలాగే వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండ్ షో టీమ్‌కి బాగా ఉపయోగపడుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

click me!