అదే జరిగితే రిటైర్మెంట్ ఆలోచనలో విరాట్ కోహ్లీ... కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమవ్వాలని..

First Published Dec 9, 2021, 2:45 PM IST

బ్యాట్స్‌మెన్‌గా, ప్లేయర్‌గా, కెప్టెన్‌గా భారత జట్టుకి ఎన్నో అద్భుత విజయాలు అందించిన విరాట్ కోహ్లీ విషయంలో బీసీసీఐ వ్యవహారించిన, వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. దీంతో త్వరలో విరాట్ కోహ్లీ వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకుంటాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

2017లో ఎమ్మెస్ ధోనీ నుంచి వైట్ బాల్ కెప్టెన్సీ అందుకున్న విరాట్ కోహ్లీ, వరుసగా మూడేళ్లు వన్డేల్లో 1000+ పరుగులు సాధించాడు... 2017లో 1460, 2018లో 1202, 2019లో 1377 పనరుగులు చేశాడు విరాట్...

అంతకుముందు ప్లేయర్‌గా 2011, 2012, 2013, 2014 సీజన్లలో 1000+వన్డే పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2010లో 5 పరుగుల తేడాతో ఆ ఫీట్‌ మిస్ అయ్యాడు...

అయితే కరోనా వైరస్ కారణంగా 2020 సీజన్‌లో 9 వన్డేలు మాత్రమే జరిగాయి. ఈ 9 మ్యాచుల్లో 431 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2021లో జరిగిన మూడు వన్డేల్లో 129 పరుగులు చేశాడు...

2019 సీజన్‌లో విరాట్‌తో పోటీ పడుతూ 1490 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 2020లో మూడు వన్డేలు ఆడి 171 పరుగులు, 2021లో 3 వన్డేలాడి 90 పరుగులు చేశాడు...

వన్డేల్లో రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయినా సరే ఫామ్‌తో, రిజల్ట్‌తో సంబంధం లేకుండా విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీని రోహిత్‌కి అప్పగించింది టీమ్ మేనేజ్‌మెంట్...

ఈ మార్పుతో విరాట్ కోహ్లీ వరుసగా రెండు, మూడు మ్యాచుల్లో విఫలమైతే అతనికి తుదిజట్టులో చోటు ఉంటుందా? అనేది అనుమానంగా మారింది...

రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్న సమయంలోనూ అతనికి అండగా నిలిచి, జట్టులో చోటు ఇస్తూ వచ్చాడు విరాట్ కోహ్లీ. ఫలితంగానే విరాట్ కెప్టెన్సీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ...

రోహిత్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీకి అలాంటి సపోర్ట్ దొరుకుతుందా? అనేది అనుమానమే. ఎందుకంటే విరాట్, రోహిత్‌ని టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌గా బహిరంగంగా ఒప్పుకున్నాడు, కానీ రోహిత్ ఎప్పుడూ అలాంటి కామెంట్లు చేయలేదు...

ఒకవేళ ఏ కారణాల వల్ల అయినా వన్డే, టీ20 ఫార్మాట్‌లో భారత జట్టులో చోటు కోల్పోతే, పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

వన్డేల్లో 43 సెంచరీలతో 12 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టీ20ల్లోనూ 3227 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు...

మోడ్రన్ క్రికెట్ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, ఇలాంటి కారణాల వల్ల క్రికెట్‌కి దూరమైతే భారత జట్టు ఓ మ్యాచ్ విన్నర్‌ను దూరం చేసుకున్నట్టే అవుతుందని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు... 

click me!