అలా మాకు ఒక ఆప్షన్ ఉన్నట్టేగా.. కోహ్లీతో ఓపెనింగ్‌పై హిట్‌మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Sep 18, 2022, 3:34 PM IST

T20I World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో ఓపెనింగ్ జోడీ మీద మొదలైన చర్చకు టీమిండియా సారథి రోహిత్ శర్మ ఫుల్ స్టాప్ పెట్టాడు. తాను ఎవరితో ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తాననేది తేల్చి చెప్పాడు. 
 
రాబోయే టీ20 ప్రపంచకప్ లో   భారత జట్టు తరఫున సారథి రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేది ఎవరు...? అన్నదానిమీద భారత క్రికెట్ లో జోరుగా చర్చ జరుగుతున్నది. రోహిత్ తో కలిసి రెగ్యులర్ ఓపెనర్ రాహుల్ ను కాకుండా ఆసియా కప్ లో విజయవంతమైన  విరాట్ కోహ్లీని బరిలోకి దించాలని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Image credit: Getty

ఫామ్ లో లేని రాహుల్ తో ఓపెనింగ్ చేయించి  వికెట్లు కోల్పోయే బదులు  మునపటి ఫామ్ అందుకున్న కోహ్లీని పంపితే అది అతడితో పాటు టీమిండియాకూ మంచిదని వాదనలు వినిపిస్తున్నాయి. కోహ్లీ ఓపెనర్ గా వస్తే టీ20లలో  ఏడాదికాలంగా భారత జట్టు తరఫున నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ అవుతాడని.. అది భారత జట్టుకే మంచిదని  చర్చోపచర్చలు సాగుతున్నాయి. 

రోహిత్ మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్ కు ముందు పలు ఆప్షన్లు అందుబాటులో ఉండటం మంచిదే. వరల్డ్ కప్ లో అవి మాకు చాలా ఉపయోగపడతాయి. జట్టులో ఏ స్థానంలోనైనా ఆడగలిగే ప్లేయర్లు ఉండటం  చాలా అరుదు. కొన్నిసార్లు మేం ఏదైనా కొత్తగా ప్రారంభించినప్పుడు అది మా సమస్య కాదు.  

మా జట్టులో  విరాట్ కోహ్లీ రూపంలో ఓపెనింగ్ ఆప్షన్ కూడా ఉండటం మాకు మంచిదే. ఈ ప్రపంచకప్ కు మేం మూడో ఓపెనర్ ను తీసుకోలేదు. అయితే కోహ్లీ రూపంలో మాకు ఆ అవకాశముంది. అతడు తన ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరఫున ఐపీఎల్ లో ఓపెనింగ్ చేసి మెరుగైన ప్రదర్శనలు చేశాడు.  

అయితే ఈ ఆప్షన్ ఉన్నా మేం కెఎల్ రాహుల్ తోనే వెళ్తాం.  టీ20 ప్రపంచకప్ లో నాతో పాటు రాహుల్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తాడు. రాహుల్ కొన్నిసార్లు విఫలమైనా జట్టులో అతడు కీలక ఆటగాడు..’ అని చెప్పాడు. 
 
ఇదే విషయమై   గౌతం గంభీర్ స్పందిస్తూ కూడా కోహ్లీని ఓపెనర్ గా కంటే వన్ డౌన్ లో పంపించిందే ఉత్తమమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రోహిత్-రాహుల్ ల జోడీ ఓపెనింగ్ చేస్తేనే మంచిదని.. వాళ్లిద్దరూ 10 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయగలిగితే అప్పుడు సూర్యకుమార్ యాదవ్ ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకుపంపి కోహ్లీని తర్వాత పంపించాలని సూచించాడు.
 
click me!