షారుక్ ఖాన్ బ్యాటింగ్, పోలార్డ్‌ను గుర్తుకు తెచ్చింది... - పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే...

First Published Apr 5, 2021, 4:08 PM IST

తమిళనాడు క్రికెట్‌లో యువ సంచలనం షారుక్ ఖాన్‌ను ఐపీఎల్ 2021 వేలంలో రూ.5 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. షారుక్‌ను కొనుగోలు చేసిన తర్వాత పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా... 

షారుక్‌ను కొనుగోలు చేసిన తర్వాత పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా... ‘కింగ్ ఖాన్’ షారుక్ కొడుకు ఆర్యన్‌ను చూసి... ‘మేం షారుక్‌ను కొన్నాం’ అంటూ ఆటపట్టించింది కూడా.
undefined
షారుక్ ఆటతీరు చూస్తుంటే, పోలార్డ్ గుర్తుకొచ్చాడని అంటున్నాడు పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే...
undefined
‘నేను ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పుడు కిరన్ పోలార్డ్‌కి నెట్స్‌లో బౌలింగ్ చేసేవాణ్ణి. అతను నెట్స్‌లో కూడా భయంకరంగా బ్యాటింగ్ చేసేవాడు. షారుక్ ఖాన్ బ్యాటింగ్ చూస్తుంటే, నాకు పోలార్డ్ గుర్తుకువచ్చాడు...
undefined
షారుక్ కూడా పోలార్డ్ లాగే స్ట్రైయిట్‌గా కొట్టడానికి ఇష్టపడతారు. అందుకే బౌలింగ్ చేయడానికి వచ్చే ముందే, నేరుగా కొట్టవద్దని పోలార్డ్‌కి చెప్పేవాడిని.
undefined
ఇప్పుడు అయితే షారుక్ ఖాన్‌కి బౌలింగ్ చేస్తుంటే, అది కూడా చెప్పలేకపోతున్నా... నా వయసు పెరిగింది. అందుకే ఈ పిల్లాడికి బౌలింగ్ చేయలేనని చెప్పేశాను...’ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు అనిల్ కుంబ్లే...
undefined
‘ఐపీఎల్ వేలం దాదాపు 3 గంటలకు ప్రారంభమైంది. ఆ సమయంలో నేను హోల్కర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నా... నేను బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా సాధన చేయాలి..
undefined
అందుకే నా పేరు వచ్చినప్పుడు నాకు చెప్పమని ఫిజియోకి చెప్పి ప్రాక్టీస్‌కి వెళ్లాను. ప్రాక్టీస్‌కి బ్రేక్ తీసుకుని వేలం చూడడానికి వచ్చాను. అప్పటికి ఇంకా నా పేరు రాలేదు...
undefined
ప్రాక్టీస్ ముగించుకుని బస్సు ఎక్కి హోటల్‌కి వెళ్తుంటే... నా పేరు వేలంలో వచ్చింది. బస్సులో మొదటి సీటులో నేను కూర్చున్నా. నా గుండె దడ మొదలైంది...
undefined
కానీ ఇంత ధర దక్కుతుందని మాత్రం నేను అస్సలు ఊహించనే లేదు... నాకు అంత భారీ ధర దక్కడంపై తమిళనాడు జట్టు సభ్యులతో పాటు కెప్టెన్ దినేశ్ కార్తీక్ కూడా ఎంతో సంతోషించారు’ అంటూ చెప్పుకొచ్చాడు షారుక్ ఖాన్...
undefined
click me!