రిషబ్ పంత్‌ని పక్కనబెట్టి దినేశ్ కార్తీక్‌ని ఆడిస్తారా... టీమిండియాపై గౌతమ్ గంభీర్ ఫైర్...

Published : Aug 30, 2022, 12:47 PM IST

ఆసియా కప్ 2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ని పక్కనబెట్టింది టీమిండియా. సీనియర్ వికెట్ కీపర్ దినేవ్ కార్తీక్‌కి తుది జట్టులో చోటు కల్పించిన టీమిండియా మేనేజ్‌మెంట్, యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని తుది జట్టు నుంచి తప్పించి... అందర్నీ ఆశ్చర్యపరిచింది... దీనిపై గౌతమ్ గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు...

PREV
17
రిషబ్ పంత్‌ని పక్కనబెట్టి దినేశ్ కార్తీక్‌ని ఆడిస్తారా... టీమిండియాపై గౌతమ్ గంభీర్ ఫైర్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్, విరాట్ కోహ్లీతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి విరాట్ కోహ్లీ (57) తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

27

అయితే ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కి తుది జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గాయం తర్వాత తిరిగి జట్టులో చేరిన కెఎల్ రాహుల్‌ని ఓపెనర్‌గా పంపిన టీమిండియా, వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్‌లను పంపించింది...

37
Image credit: PTI

‘ఆసియా కప్ 2022 టోర్నీలో మనకి ఉన్న మ్యాచులే తక్కువ. ప్రతీ మ్యాచ్ గెలవడం కీలకమే. అలాంటి టైమ్‌లో ఇలాంటి ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మహా అయితే ఆసియా కప్‌లో టీమిండియా మరో ఐదు గేమ్‌లు ఆడుతుందేమో... లేదా ఆరు మ్యాచులు...

47
Rishabh Pant

ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌ ఉంది. ఇకనైనా టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ని ఫిక్స్ చేయాలి. ఇలా ప్రతీ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌ని మారుస్తూ పోవడం కరెక్ట్ కాదు. ప్రతీ పొజిషన్‌కి బ్యాకప్ ప్లేయర్లు కావాలనుకోవడం మంచిదే... అయితే ప్రతీ మ్యాచ్‌లోనూ ప్రయోగాలు చేయడం కూడా మంచిది కాదు...

57
Sanju Samson Rishabh Pant

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ లేకపోవడం నాకు షాక్‌ని కలగచేసింది. ఎందుకంటే రిషబ్ పంత్ మ్యాచ్ విన్నర్. మిడిల్ ఆర్డర్‌లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అవసరం చాలా ఉంటుంది. టీమిండియాలో చాలామంది రైట్ హ్యాండెడ్ బ్యాటర్లు ఉన్నారు. అందుకే రిషబ్ పంత్ కీ ప్లేయర్...

67

రిషబ్ పంత్ ఓపెనింగ్ కూడా చేయగలడు. మిడిల్ ఆర్డర్‌లో ఆడగలడు. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేయగలడు. అయితే అతన్ని ఎక్కువ కాలం పక్కనబెట్టలేరు. నా ఉద్దేశంలో ఇప్పటికే దినేశ్ కార్తీక్ కంటే రిషబ్ పంత్‌ని ఆడించడం చాలా ముఖ్యం... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

77

పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కూడా గౌతీ వ్యాఖ్యలకు సపోర్ట్ చేశాడు. ‘రిషబ్ పంత్‌ని పక్కనబెట్టాలనుకోవడం చాలా పెద్ద నిర్ణయం. అతను మోడ్రన్ టాప్ ప్లేయర్. అతను బ్యాటింగ్ చేసే విధానం అద్భుతం. రిషబ్ పంత్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్... టీ20 వరల్డ్ కప్‌లో పంత్ కీ ప్లేయర్ అవుతాడు...’ అంటూ కామెంట్ చేశాడు వసీం అక్రమ్... 

Read more Photos on
click me!

Recommended Stories