ఎవ్వరూ చూడట్లేదు చేసేయమన్నాడు... అతని మాట వినడమే నేను చేసిన తప్పు! షాహిదీ ఆఫ్రిదీ షాకింగ్ కామెంట్స్...

Published : Sep 22, 2022, 05:21 PM ISTUpdated : Sep 22, 2022, 05:24 PM IST

‘ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్’... యుద్ధంలో, ప్రేమలో గెలవడానికి ఏం చేసినా తప్పు కాదు. అయితే జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో మాత్రం ఈ సూత్రం వర్తించదు. ఎందుకంటే క్రికెట్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని బ్రేక్ చేస్తే ఎవ్వరైనా శిక్ష అనుభవించాల్సిందే. పాక్ క్రికెటర్లకు ఈ విషయంలో చాలా అనుభవం ఉంది.  పాక్ మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ కూడా ఓ మ్యాచ్‌లో పిచ్ టాంపరింగ్‌కి చేసి, శిక్ష అనుభవించాడు...

PREV
16
ఎవ్వరూ చూడట్లేదు చేసేయమన్నాడు... అతని మాట వినడమే నేను చేసిన తప్పు! షాహిదీ ఆఫ్రిదీ షాకింగ్ కామెంట్స్...
Shahid Afridi-Sachin Tendulkar

పాకిస్తాన్ తరుపున 398 వన్డేలు ఆడి 8064 పరుగులు, 395 వికెట్లు తీసిన షాహిదీ ఆఫ్రిదీ, 1996లో శ్రీలంకపై 37 బంతుల్లో సెంచరీ చేసి వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో 1416 పరుగులు చేసిన షాహిదీ ఆఫ్రిదీ, 2009 టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు...

26

2005లో ఫైసలాబాద్‌లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో షాహిదీ ఆఫ్రిదీ పిచ్ టాంపరింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కాడు. దీంతో అతనిపై ఓ టెస్టు, రెండు వన్డేల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి ఓపెన్ అయ్యాడు ఆఫ్రిదీ...

36

‘‘ఆ సిరీస్ చాలా చక్కగా నడిచింది. ఫైసలాబాద్‌లో టెస్టు మ్యాచ్‌లో బంతి ఏ మాత్రం తిరగడం లేదు. కనీసం స్వింగ్ కానీ సీమ్ కానీ రావడం లేదు. అదో నిస్తేజమైన పిచ్. ఇంగ్లాండ్ బ్యాటర్లు కొన్ని సెషన్ల పాటు బ్యాటింగ్ చేస్తున్నారు.చాలా బోరింగ్‌గా సాగుతోంది...

46

నేను బంతి షేప్ మార్చడానికి, వికెట్లు తీయడానికి చాలా ప్రయత్నించా. అయినా ఫలితం శూన్యం. బోరింగ్‌గా సాగుతున్నప్పుడే సడెన్‌గా ఓ గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ సంఘటనతో అంతా చెల్లాచెదురు అయ్యారు. మ్యాచ్ కాసేపు ఆగింది..

56
afridi

అప్పుడు షోయబ్ మాలిక్ దగ్గరికి వెళ్లి... ‘ఈ పిచ్‌ని కాస్త మార్చాలని నా మనసు పీకేస్తోంది. బంతి తిరిగేలా కాలితో రాకాలని ఉంది...’ అని చెప్పాను. దానికి అతను ‘చేసేయ్... ఎవ్వరూ చూడడం లేదు...’ అన్నాడు. నేను వెంటనే చేశా...

66

నేను కాలుతో రుద్దుతూ పిచ్‌ని మార్చాలని ప్రయత్నించడం కెమెరాల్లో రికార్డైంది. అంతా ఆ తర్వాత జరిగిందంతా చరిత్రే. నేను వెనక్కి తిరిగి చూసుకున్న ప్రతీసారీ, ఆ తప్పు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ రోజు అలా చేయకుంటే బాగుండు అనిపిస్తుంది...’’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ... 

click me!

Recommended Stories