బాబర్‌ను ట్రోల్ చేసిన అమిత్ మిశ్రా.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన పాకిస్తాన్ మాజీ సారథి

Published : Oct 31, 2022, 05:09 PM IST

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో అత్యంత చెత్త ఫామ్ తో విమర్శలు ఎదుర్కుంటున్న   పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ పై  టీమిండియా  వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ట్విటర్ వేదికగా  స్పందించి  వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 

PREV
16
బాబర్‌ను ట్రోల్ చేసిన అమిత్ మిశ్రా.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన పాకిస్తాన్ మాజీ సారథి

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మెగా టోర్నీలో పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ బ్యాటింగ్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  స్వయంగా పాక్ మాజీలే బాబర్ ఆజమ్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్  పై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు మ్యాచ్ లలో కలిపి బాబర్.. 8 పరుగులే చేయడం గమనార్హం.  

26

భారత్ తో మ్యాచ్ లో బాబర్ డకౌట్ అవగా..  జింబాబ్వే తో పాటు నెదర్లాండ్స్ మీద కలిపి 8 పరుగులు మాత్రమే చేశాడు. అయితే  అంతకుముందు న్యూజిలాండ్ లో ఆడిన ముక్కోణపు సిరీస్ లో కూడా  పెద్దగా రాణించలేదు. పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్న బాబర్ పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 

36

మిశ్రా ట్విటర్ వేదికగా.. ‘ఈ దశ  దాటిపోతుంది.. స్ట్రాంగ్ గా ఉండు..’ అని రాసుకొస్తూ బాబర్ ను ట్యాగ్  చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.  విరాట్ కోహ్లీ ఆసియా కప్ కు ముందు అత్యంత చెత్త ఫామ్ తో  విమర్శలు ఎదుర్కుంటున్న తరుణంలో బాబర్ కూడా ఇలాగే కామెంట్స్ చేయడం గమనార్హం. 

46

శ్రీలంక పర్యటనకు వెళ్లిన బాబర్ ఆజమ్ కోహ్లీ ఫామ్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘కోహ్లీ దిగ్గజ బ్యాటర్. కానీ ఇప్పుడు గడ్డుకాలం నడుస్తుంది..  ఈ ఫేజ్ దాటిపోతుంది..’ అని  కామెంట్స్ చేసిన విషయం విదితమే.  ఇప్పుడు ఇవే వ్యాఖ్యలను  అమిత్ మిశ్రా తన  ట్వీట్ లో పేర్కొన్నాడు. 

56

దీంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ తో పాటు  ఆ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిదికి అమిత్ మిశ్రా ట్వీట్ ఆగ్రహం తెప్పించింది.   మిశ్రా ట్వీట్ పై అఫ్రిది సామా టీవీతో స్పందిస్తూ..  ‘మీరు చెబుతున్న ఈ వ్యక్తి (అమిత్ మిశ్రా) కూడా ఇండియా తరఫున ఆడాడు. అయితే అతడు స్పిన్నరా..? బ్యాట్స్‌మెనా..? అనేది అనుమానంగా ఉంది. ఏం ఫర్వాలేదు.  అతడు చెప్పినట్టే ముందుకు సాగుదాం.. తప్పకుండా ఈ దశ దాటిపోతుంది..’ అని  కౌంటర్ ఇచ్చాడు. 

66

ఈ  మెగా టోర్నీలో భారత్ చేతిలో చిత్తయిన పాకిస్తాన్.. తర్వాత జింబాబ్వేతో కూడా దారుణంగా ఓడింది. ఎట్టకేలకు ఆదివారం  నెదర్లాండ్స్ తో ముగిసిన మ్యాచ్ లో విజయాన్ని సొంతం చేసుకుంది. అనధికారికంగా ఆ జట్టు టోర్నీలో సెమీస్ అవకాశాలను దాదాపు కోల్పోయినా ఇంకా అధికారికంగా  రేసులోనే ఉంది.  కానీ అది ఆ జట్టు ఆడే మ్యాచ్ లతో పాటు ఇతర జట్ల విజయాలు  ఆ జట్టు  సెమీస్  అవకాశాల మీద ఆధారపడ్డాయి.  

click me!

Recommended Stories