కెఎల్ రాహుల్ అయితే ఏంటి? టీమ్ కోసం ఎవ్వరినైనా కూర్చోబెట్టాల్సిందే... హర్భజన్ సింగ్ కామెంట్...

First Published | Oct 31, 2022, 4:41 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కెఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కొనసాగుతూ వస్తోంది. ఐపీఎల్ 2022 తర్వాత గాయపడి రెండు నెలల బ్రేక్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్, ఆసియా కప్‌ 2022లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అయినా అతని స్కిల్స్ మీద ఉన్న నమ్మకంతో టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్‌మెంట్...
 

KL Rahul

పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 బంతులాడి 4 పరుగులు చేసి అవుటైన కెఎల్ రాహుల్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతులాడి 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ 14 బంతులాడి 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మొత్తంగా మూడు మ్యాచుల్లో కలిపి 22 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, అందుకోసం 36 బంతులు ఎదుర్కొన్నాడు...

KL Rahul

కెఎల్ రాహుల్ వరుసగా విఫలమవుతున్నా అతనికి వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సాహిస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. ఐసీసీ టోర్నీల్లో పెద్దగా రికార్డు లేని కెఎల్ రాహుల్‌కి ఇన్ని ఛాన్సులు ఇచ్చే బదులు, రిషబ్ పంత్‌ని ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా రిషబ్ పంత్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాడు...


Image credit: PTI

‘టీమిండియా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. కెఎల్ రాహుల్ గొప్ప ప్లేయరే, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే అతను ఇప్పుడు సరైన ఫామ్‌లో లేడు. ఐసీసీ వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో గొప్ప ప్లేయర్ల కంటే ఫామ్‌లో ఉన్న ప్లేయర్లు చాలా అవసరం...

Image credit: PTI

కెఎల్ రాహుల్ పరుగులు చేయడానికి కష్టపడుతున్నప్పుడు రిషబ్ పంత్‌కి అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు. రిషబ్ పంత్ ఎంట్రీ ఇస్తే లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది. దినేశ్ కార్తీక్ గాయపడ్డాడు. అతని ఫిట్‌నెస్ గురించి నాకు సమాచారం లేదు...

Image credit: Getty

ఒకవేళ అతను ఫిట్‌గా లేకపోతే రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తే బెటర్. దీపక్ హుడాని మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే అతనితో బౌలింగ్ చేయించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అశ్విన్ ప్లేస్‌లో యజ్వేంద్ర చాహాల్‌ని ఆడిస్తే మంచిది....

Image credit: Getty

అశ్విన్ మంచి బౌలరే కానీ టీ20ల్లో వికెట్ టేకర్ కాదు. యజ్వేంద్ర చాహాల్‌కి టీ20లో వికెట్లు ఎలా తీయాలో బాగా తెలుసు. అతను పరుగులు ఇచ్చినా 2-3 వికెట్లు తీస్తాడు. చాహాల్ టీమ్‌కి కావాల్సిన మ్యాచ్ విన్నర్. అశ్విన్ బ్యాటుతో పరుగులు చేయగలడనే ఉద్దేశంతో చాహాల్‌ని పక్కనబెడుతున్నారు...

Image credit: PTI

అయితే యజ్వేంద్ర చాహాల్ ఉండి వికెట్లు తీస్తే చేయాల్సిన పరుగులు కూడా తగ్గిపోతాయి కదా...చాహాల్ మ్యాచ్ విన్నర్ అనేది ఇప్పటికే నిరూపితమైన విషయం కాబట్టి అతనిపై నమ్మకం ఉంచాలి... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్... 

Latest Videos

click me!