దీప్తి శర్మ రనౌట్‌పై తెగని రచ్చ... ఇంగ్లీష్ మీడియాపై హర్షా భోగ్లే ఫైర్! బెన్ స్టోక్స్ కామెంట్...

First Published Oct 1, 2022, 4:15 PM IST

టీమిండియా వుమెన్స్, ఇంగ్లాండ్ వుమెన్స్ మధ్య జరిగిన మూడో వన్డేలో దీప్తి శర్మ  చేసిన (మన్కడింగ్) రనౌట్ తీవ్ర వివాదాస్పదమైంది. ఐసీసీ మన్కడింగ్‌ని రనౌట్‌గా పరిగణించాలని రూల్ మార్చినా దీన్ని ‘క్రీడా స్ఫూర్తి’కి విరుద్ధమంటూ, ఇలా గెలిచినందుకు భారత జట్టు సిగ్గపడాలంటూ కొందరు ఇంగ్లీష్ క్రికెటర్లు ట్వీట్లు చేశారు...

ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఈ క్రీడా స్ఫూర్తి గురించి చేసిన వరుస ట్వీట్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. చివరికి ఈ వివాదంలోకి సచిన్ టెండూల్కర్‌ని లాగేందుకు ప్రయత్నించిన స్టువర్ట్ బ్రాడ్, నెటజన్లతో చివాట్లు తిన్నాడు. ఈ వివాదం ఎంతకీ చల్లారకపోవడంతో భారత స్టార్ కామెంటేటర్, క్రికెట్ యాంకర్ హర్షా భోగ్లే దీనిపై స్పందించాడు...

‘ఇంగ్లాండ్ మీడియాలో చాలామంది క్రీడా రూల్స్‌ని బట్టి నడుచుకున్న ఓ అమ్మాయిని టార్గెట్ చేయడం దారుణం. ఇలా అమ్మాయిని తిట్టి అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించుకోవాలని చూస్తున్నారు. ఇందులో కొందరు సో కాల్డ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు...

Harsha Bhogle

ఇదేనా సంస్కారం. ఇంగ్లీష్ వాళ్లు అది తప్పు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లు క్రికెట్ ప్రపంచాన్ని చాలా ఏళ్లు ఏలారు, క్రికెట్‌లో ఇలా ఉండాలి? అలా ఉండకూడదని వాళ్లే చెప్పారు. అయితే ఈ ఆధిపత్యాన్ని కొందరు ప్రశ్నించారు. అయితే ఇప్పటికీ వారి ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పు రాలేదు...

ప్రపంచం ఏది తప్పు అనుకుంటుందో దాన్ని ఇంగ్లాండ్ కూడా తప్పుగా ఒప్పుకోవాలి. అంతేకానీ ఐసీసీ తప్పు కాదని చెప్పిన దాన్ని కాదు... తప్పే అనడం మూర్ఖత్వం. ఇంగ్లాండ్ ఆలోచనవిధానమే తప్పు. స్పిన్ పిచ్‌లు రూపొందించడం తప్పు కానీ ఫాస్ట్ బౌలింగ్ ట్రాక్‌లు రూపొందించడం తప్పు కాదనే వింత వాదన వారిది...

ఎందుకంటే ఇంగ్లాండ్‌లో పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కి చక్కగా ఉపయోగపడతాయి.ఇంగ్లాండ్ ప్లేయర్లు స్పిన్‌ ఆడలేరు. అందుకే వాళ్లకి నచ్చినట్టు రూల్స్ పెట్టుకుంటారు. నచ్చని తప్పని తప్పు అంటూ తిడుతూ ఇలా టార్గెట్ చేస్తారు. ఈ దాడి ఎలా ఉంటుందంటే వాళ్లు అనే కొద్ది మనమే తప్పు చేశామా... అనే భావన ఎదుటివారిలో కలుగుతుంది...

బౌలర్ బంతి వేయకముందు నాన్‌స్ట్రైయికర్ క్రీజు దాటకూడదనేది రూల్. ఆ రూల్ దాటితే రనౌట్ చేసే అవకాశం బౌలర్‌కి ఉంటుంది. దాన్ని ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఇందులో క్రీడా స్ఫూర్తికి సంబంధం లేదు. ఇకనైనా దీప్తిని టార్గెట్ చేయడం ఆపండి.. ’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు హర్షా భోగ్లే...

ఈ ట్వీట్లకు ఇంగ్లాండ్ టెస్టు టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. ‘హర్షా.. మన్కడ్‌‌పై జనాల అభిప్రాయానికి కల్చర్‌కి లింగ్ ఏంటి? రెండేళ్ల క్రితం 2019 వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. ఇప్పటికి నన్ను తిడుతూ చాలా మంది భారత అభిమానులు మెసేజ్‌లు చేస్తున్నారు. దీనిపై నువ్వేమంటావ్’ అంటూ ట్వీట్ చేశాడు...

Ben Stokes

బెన్ స్టోక్స్ కామెంట్‌కి హర్షా భోగ్లే రిప్లై ఇచ్చాడు. ‘అక్కడ ఓవర్‌త్రోలో నీ తప్పు ఏమీ లేదు. ఆ విషయంలో నీకు సపోర్ట్‌గా ఉంటాం. నాన్ స్ట్రైయికర్ బ్యాకింగ్ గురించి ఇంగ్లాండ్‌లో వచ్చిన స్పందన గురించి మాత్రమే మాట్లాడుతున్నా. క్రికెట్ గురించి నీకు ఏం చెప్పి నేర్పించారో అదే కల్చర్. అందుకే అలా అన్నాను...’ అంటూ సమాధానం ఇచ్చాడు...

Ben Stokes

ఇంగ్లాండ్ క్రికెట్లరను అంటే బెన్ స్టోక్స్‌ ఎందుకు స్పందిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండడం కొసమెరుపు. ఇంగ్లాండ్ టెస్టు టీమ్‌కి కెప్టెన్సీ చేస్తున్నప్పటికీ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్‌లో పుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికీ బెన్ స్టోక్స్ కుటుంబం న్యూజిలాండ్‌లోనే నివాసం ఉంటోంది... 

click me!