అతనే టీమిండియా ఫ్యూచర్! క్రికెట్‌ ప్రపంచాన్ని ఏలతాడు... శుబ్‌మన్ గిల్‌పై రోహన్ గవాస్కర్ కామెంట్...

First Published Oct 1, 2022, 3:34 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ వరకూ శుబ్‌మన్ గిల్ టీ20లను ఆడే విధానంపై పెద్ద చర్చే జరిగింది. టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడతాడని ట్రోల్స్ ఎదుర్కొన్న శుబ్‌మన్ గిల్, ఐపీఎల్ పర్పామెన్స్ ఆధారంగా భారత టెస్టు టీమ్‌కి ఎంపికయ్యాడు కూడా. అయితే ఐపీఎల్ 2022 సీజన్ అతని కెరీర్‌ని మలుపు తిప్పింది...

టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడే శుబ్‌మన్ గిల్‌ని రూ.8 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. అయితే గిల్ ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు. 16 మ్యాచుల్లో 483 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు..

2018లో కెరీర్ ఆరంభించిన శుబ్‌మన్ గిల్ ఆ సీజన్ తర్వాత 2019లో 146+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు. ఆ తర్వాత మూడు సీజన్లలో కూడా గిల్ స్ట్రైయిక్ రేటు 110-124 దాటలేదు. అయితే 2022లో 132+ స్ట్రైయిక్ రేటుతో నిలకడైన పర్ఫామెన్స్ చూపించి... వన్డే టీమ్‌లోకి కూడా రీఎంట్రీ ఇచ్చాడు శుబ్‌మన్ గిల్...

2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టు ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్ గిల్, 3 టెస్టుల్లో 51.80 సగటుతో 259 పరుగులు చేశాడు. గబ్బా టెస్టులో రిషబ్ పంత్ 89 పరుగులతో క్రెడిట్ మొత్తం కొట్టేసినా అంతకుముందు శుబ్‌మన్ గిల్ చేసిన 91 పరుగులు వెలకట్టలేనివి... 

Image credit: Shubman GillTwitter

‘భారత మాజీ క్రికెటర్ అమోల్ మంజుదర్, శుబ్‌మన్ గిల్ గురించి నాకు మొదటిసారి చెప్పాడు. మంజుదర్ ఎన్‌సీఏలో ఉన్నప్పుడు శుబ్‌మన్ గిల్ ఆటను దగ్గర్నుంచి గమనించాడు. ‘రోహాన్... నేను ఓ ఫ్యూచర్ సూపర్‌స్టార్‌ని చూశాను. అతను కచ్చితంగా టీమిండియాకి ఆడతాడు. అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు..’ అని చెప్పాడు...
 

మంజుదర్ మాటల్లో ఆ ఉత్సాహం, సంతోషం చూసి నాకు శుబ్‌మన్ గిల్‌ని చూడాలని అనుకున్నా. గిల్ ఆటని గమనించాక మంజుదర్ మాటల్లో నిజం ఉందని అనిపించింది. గిల్, భవిష్యతుల్లో మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకి కీలక ప్లేయర్‌గా మారతాడు...

Image credit: Getty

అతని ఆటలో టెక్నిక్ ఉంది, స్ట్రైయిల్ ఉంది. వైట్ బాల్ క్రికెట్‌ని ఏలడానికి కావాల్సిన పనిముట్లన్నీ గిల్ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. రెడ్ బాల్ క్రికెట్‌లో అతను ఇప్పటికే మంచి నెంబర్స్ క్రియేట్ చేశాడు...

శుబ్‌మన్ గిల్‌కి వరుస అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయినంత మాత్రం తీసి పక్కనబెట్టే ప్రొడక్ట్ కాదతను. సరైన అవకాశాలు వస్తే, క్రికెట్ ప్రపంచాన్ని ఏలతాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ రోహాన్ గవాస్కర్... 

click me!