మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ వద్దు... అతను కావాల్సిందే, వెంటనే ఇంగ్లాండ్‌కి పంపండి...

First Published Jul 3, 2021, 10:59 AM IST

యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి దూరమైన విషయం తెలిసిందే. దీంతో అప్పుడు టూర్‌కి ఎంపిక చేయని ప్లేయర్, ఇప్పుడు టీమిండియాకి కావాలంటూ కోరుతున్నారట సెలక్టర్లు... ఆ ప్లేయర్ మరెవరో కాదు యంగ్ సెన్సేషన్ పృథ్వీషా...

ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ టెస్టులో ఆడిన పృథ్వీషా... ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఘోరంగా విఫలమై తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ అయ్యి చెత్త రికార్డు నమోదుచేయడంతో పృథ్వీషాని పక్కనపెట్టేశారు...
undefined
ఆడిలైడ్ టెస్టు తర్వాత భారత ఆటగాళ్లు గాయపడి జట్టుకి దూరమవుతున్నా, పృథ్వీషాకి మరో అవకాశం ఇచ్చే సాహసం కూడా చేయలేకపోయింది భారత జట్టు... అయితే పృథ్వీషా ఊహంచిన రీతిలో సత్తా చాటుతూ కమ్‌బ్యాక్ ఇచ్చాడు...
undefined
ఆస్ట్రేలియా టూర్ తర్వాత జరిగిన విజయ్ హాజారే ట్రోఫీ 2021 సీజన్‌లో 800+ పైగా పరుగులు, నాలుగు సెంచరీలతో రికార్డు స్థాయిలో చెలరేగిపోయిన పృథ్వీషా... ఐపీఎల్ 2021లోనూ మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు...
undefined
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు ఫోర్లు బాది, క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్న పృథ్వీషాకి ఇంగ్లాండ్‌ టూర్‌కి ప్రకటించిన జట్టులో మాత్రం చోటు దక్కలేదు...
undefined
పృథ్వీషాను ఎంపిక చేయడంపై క్రికెట్ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేసినా... అతని ఫిట్‌నెస్ సరిగా లేదని, వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తేలా మరింత బరువు తగ్గాలని బీసీసీఐ సూచించినట్టు వార్తలు వచ్చాయి...
undefined
ఇంగ్లాండ్‌ టూర్‌కి ఎంపిక కాకపోయినా, శ్రీలంకతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు పృథ్వీషా. ఈ టూర్‌లో శిఖర్ ధావన్‌తో కలిసి పృథ్వీషా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది...
undefined
అయితే శుబ్‌మన్ గిల్ కారణంగా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ మొత్తానికి దూరం కావడంతో బీసీసీఐ సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్... పృథ్వీషాను ఇంగ్లాండ్‌కి రప్పించాలని చూస్తున్నారట...
undefined
ఇప్పటికే బయో బబుల్ జోన్‌లో క్వారంటైన్ పూర్తి చేసుకున్న పృథ్వీషా... త్వరలో లంక టూర్‌కి సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో అతన్ని అర్ధాంతరంగా ఇంగ్లాండ్‌కి రప్పిస్తే... టెస్టు సిరీస్ ఆరంభమయ్యే సమయానికి ఆడించే అవకాశం కూడా ఉంటుంది...
undefined
పృథ్వీషాను ఇంగ్లాండ్‌కి పంపించినా లంక టూర్‌లో దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా వంటి ప్లేయర్లు ఓపెనర్లుగా అందుబాటులో ఉన్నారు. కాబట్టి వారికి పెద్ద ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
undefined
అయితే శిఖర్ ధావన్ మాత్రం తనకి అచొచ్చిన పార్టనర్‌, సిరీస్‌లో ఉండాలని భావిస్తున్నాడట. దీంతో శ్రీలంకతో జరిగే వన్డే, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత పృథ్వీషా... లండన్ ఫ్లైట్ ఎక్కబోతున్నట్టు సమాచారం...
undefined
అప్పటికి ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆరంభం కాకపోయినా, క్వారంటైన్ నిబంధనలు పూర్తి చేసుకుని రెండో టెస్టు సమయానికి పృథ్వీషా జట్టులో చేరబోతున్నట్టు సమాచారం...
undefined
ఇదే జరిగితే గత డబ్ల్యూటీసీ టోర్నీలో రెండు డబుల్ సెంచరీలు, మూడు సెంచరీలు, 800లకు పైగా పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌కి మరోసారి నిరాశ ఎదురవుతుంది...
undefined
అలాగే దాదాపు ఏడాదిన్నరగా టెస్టు టీమ్‌లో ప్లేస్ కోసం ఆశగా ఎదురుచూస్తూ, రిజర్వు బెంచ్‌కే పరిమితమవుతున్న కెఎల్ రాహుల్‌ కూడా ఇంకొన్నాళ్లు ఆగాల్సి వస్తుంది...
undefined
click me!