హర్భజన్ సింగ్‌కి భజ్జీ అనే నిక్‌నేమ్ పెట్టింది అతనే... ఆ ఇన్నింగ్స్ తర్వాత ‘టర్బనేటర్‌’గా...

First Published Jul 3, 2021, 10:14 AM IST

భారత జట్టు తరుపున టెస్టుల్లో మొట్టమొదటి హ్యాట్రిక్ తీసిన క్రికెటర్ హర్భజన్ సింగ్. ఆస్ట్రేలియాపై ఈ రికార్డు ఫీట్ సాధించిన హర్భజన్ సింగ్ పుట్టినరోజు నేడు. 41 ఏళ్ల హర్భజన్ సింగ్, ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లోకి కమ్‌బ్యాక్ ఇవ్వగలననే నమ్మకంతో ఉన్నాడు. అసలు హర్భజన్‌కి ‘భజ్జీ’ అనే నిక్‌నేమ్ ఎలా వచ్చిందో తెలుసా...

1998లో టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చిన హర్భజన్ సింగ్, 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టుకి ఎన్నో అద్వితీయ విజయాలు అందించిన భజ్జీ, చాలామంది స్పిన్నర్లకు రోల్ మోడల్‌ కూడా...
undefined
2001లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో తొలి టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లోనూ భారత జట్టు భారీ విజయాలు అందుకుంది...
undefined
రెండో టెస్టులో 171 పరుగల భారీ తేడాతో గెలిచిన టీమిండియా, ఆ తర్వాత మూడో టెస్టులో 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. రెండో టెస్టులో 13 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్‌, భారత్ విజయంలో కీ రోల్ పోషించాడు...
undefined
ఈ విజయం తర్వాత హర్భజన్ సింగ్‌ను పొడుగుతూ ‘హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా టీమ్ మొత్తాన్ని టర్మినేట్ చేశాడు...’ అంటూ హెడ్‌లైన్స్‌ పెట్టింది ఆస్ట్రేలియా మీడియా.
undefined
హర్భజన్ సింగ్, సిక్కు మతాన్ని ఆచరిస్తూ టర్బన్ ధరిస్తాడని అందరికీ తెలిసిందే. దీంతో టర్మినేటర్ అనే మాటకి బదులుగా ‘టర్బనేటర్’ అనే కొత్త పద ప్రయోగం చేసింది ఆసీస్ మీడియా. ఈ నిక్ నేక్ బాగా పాపులర్ కావడంతో హర్భజన్ సింగ్ కూడా తన పేరు ముంగిట ‘టర్బనేటర్’ అని చేర్చుకున్నాడు..
undefined
ఇదే కాకుండా హర్భజన్ సింగ్‌కి ‘భజ్జీ’, బజ్జీ పా’ అనే నిక్‌నేమ్స్ ఉన్నాయి. మాజీ భారత క్రికెటర్, వికెట్ కీపర్ నయన్ మోంగియా... హర్భజన్ సింగ్‌కి ‘భజ్జీ’ అనే నిక్‌నేమ్ పెట్టాడు...
undefined
మోంగియా వికెట్ కీపింగ్ చేసే సమయంలో హర్భజన్ సింగ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు తనదైన స్టైల్‌లో కామెంటరీ చేస్తూ ఎంకరేజ్ చేసేవాడు. దీంతో హర్భజన్‌ పేరులోని భజన్‌ని భజ్జీగా మార్చి, ఇలా పిలిచేవాడు... కాలక్రమేణా హర్భజన్ సింగ్‌కి భజ్జీ అనే నిక్‌నేమ్ సెటిల్ అయిపోయింది.
undefined
అయితే హర్భజన్ సింగ్‌ని చిన్నతనంలో ‘సోనూ’ అని ముద్దుగా పిలిచేవాళ్లంట తన ఇంట్లోవాళ్లు... భారత జట్టులో సీనియర్ ప్లేయర్‌గా మిగిలిన హర్భజన్ సింగ్‌ను ధోనీ కెప్టెన్సీలో జట్టులోకి వచ్చిన యంగ్ ప్లేయర్లు ‘భజ్జీ పా’ అని గౌరవంగా పిలిచేవాళ్లు...
undefined
టెస్టు క్రికెట్‌లో నాలుగుసార్లు ఆరేసి వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన హర్భజన్ సింగ్, 2001లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ తీయడమే కాకుండా మూడు టెస్టుల్లో 32 వికెట్లు తీసి మూడు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచాడు.
undefined
మొత్తంగా 367 అంతర్జాతీయ మ్యాచుల్లో 711 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, 28 సార్లు ఐదేసి వికెట్లు ప్రదర్శన ఇచ్చాడు. అలాగే బ్యాటుతోనూ రాణించి 2 సెంచరీలు చేసిన హర్భజన్ సింగ్, 3570 పరుగులు రాబట్టాడు.
undefined
క్రికెట్ కాకుండా పంజాబ్‌లో డీఎస్‌పీ ఉద్యోగాన్ని కూడా పొందిన హర్భజన్ సింగ్, ప్రస్తుతం ‘ఫ్రెండ్‌షిప్’ అనే తమిళ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
undefined
click me!