ఇక రెస్ట్ ఇచ్చేది లే! ఆసియా కప్ నుంచి టీ20 వరల్డ్ కప్ వరకూ... బిజీ బిజీగా గడపనున్న స్టార్లు...

First Published Jul 31, 2022, 2:08 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు పూర్తిగా మారిపోయింది. అంతకుముందు చిన్నదీ, పెద్దదీ అనే తేడా లేకుండా ప్రతీ సిరీస్‌కి సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరు ప్లేయర్లు అందుబాటులో ఉండేవాళ్లు. మూడు మ్యాచుల సిరీస్‌లో రెండు మ్యాచులు గెలిస్తే,ఆఖరి మ్యాచ్‌లో మాత్రమే సీనియర్లకు రెస్ట్ దొరికేది... కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది...

రోహిత్ శర్మ కెప్టెన్‌గా, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమ్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. 2022లో ఇప్పటిదాకా ఏడు నెలలు గడిస్తే, భారత జట్టుకి ఏడుగురు కెప్టెన్లు మారారు...

సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజూ శాంసన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్... ఇలా వరుసగా ఓపెనర్లను కూడా మారుస్తూ పిచ్చిపిచ్చి ప్రయోగాలు చేస్తోంది భారత జట్టు...

Image credit: Getty

తాజాగా జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌కి జట్టును ప్రకటించిన బీసీసీఐ, పసికూనపై జరిగే సిరీస్‌కు సీనియర్లను దూరం పెట్టింది.. వాస్తవానికి ఈ సిరీస్‌కి విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ అందుబాటులో ఉంటారని ప్రచారం జరిగింది...

ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ, జింబాబ్వేపై ఆడితే అయినా ఫామ్‌లోకి వచ్చి సెంచరీలు చేస్తాడేమోనని ఫ్యాన్స్ కూడా సంతోషించారు. అయితే వెస్టిండీస్‌పైన ఆడడానికి ఇష్టపడని కోహ్లీ, జింబాబ్వేతో ఆడేందుకు ఒప్పుకోలేదట...

దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహాల్ వంటి సీనియర్లు ఎవ్వరూ లేకుండా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా..

అయితే జింబాబ్వే టూర్ ముగిసిన తర్వాత ఆసియా కప్ మొదలు కానుంది. ఆసియా కప్ నుంచి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ వరకూ జరిగే ప్రతీ సిరీస్‌లోనూ సీనియర్లు ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిందట బీసీసీఐ...

ఆసియా కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలతో టీ20 సిరీస్‌లు ఆడబోతోంది టీమిండియా. ఈ టోర్నీలకు సీనియర్లు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, చాహాల్ కచ్ఛితంగా అందుబాటులో ఉండబోతున్నారని సమచారం...

ఆసియా కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసే జట్టునే టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో ఆడించబోతున్నారని, ఆటగాళ్లు గాయపడితే తప్ప భారీ మార్పులు ఉండకపోవచ్చని సమాచారం... త్వరలో ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించబోతోంది బీసీసీఐ. అనధికారంగా ఇది టీ20 వరల్డ్ కప్ 2022 ఆడే జట్టు అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 

click me!