నేను నీ అంత టాలెంటెడ్ కాదు.. అందుకే ప్రాక్టీస్ చేయను.. సర్ఫరాజ్‌తో మిస్టర్ 360 ముచ్చట..

Published : Feb 07, 2023, 02:26 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడటానికంటే ముందు సర్ఫరాజ్ ఖాన్..   ఐపీఎల్ లో ఆర్సీబీకి ఆడాడు.   ఆ టీమ్ తో నాలుగు సీజన్లు  ఉన్నాడు.  ఈ క్రమంలో సర్ఫరాజ్.. క్రిస్ గేల్, ఏబీడీ,  విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. 

PREV
16
నేను నీ అంత టాలెంటెడ్ కాదు.. అందుకే ప్రాక్టీస్ చేయను.. సర్ఫరాజ్‌తో మిస్టర్ 360 ముచ్చట..

దేశవాళీ క్రికెట్ లో  సర్ఫరాజ్ ఖాన్ ఒక సంచలనం. ఈ ముంబై కుర్రాడు  క్రీజులోకి వచ్చాడంటే పరుగులు వరదై పారాల్సిందే.   ముఖ్యంగా రంజీలలో అయితే   సర్ఫరాజ్ ఖాన్ విన్యాసాలకు  అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఫిదా అంటున్నారు.  సెంచరీల మీద సెంచరీలు బాదుతున్ సర్ఫరాజ్ ను గతంలో   సౌతాఫ్రికా  మాజీ సారథి  ఏబీ డివిలియర్స్  ప్రశంసించాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. 

26

ఆకాశ్ చోప్రాతో కలిసి జియో సినిమాకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  సర్ఫరాజ్ మాట్లాడుతూ.... ‘నేను ఆర్సీబీ తరఫున ఆడేప్పుడు డివిలియర్స్ తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నా.  మ్యాచ్ లకు ముందు డివిలియర్స్  ప్రాక్టీస్ కు వచ్చే వాడు కాదు.  ఎప్పుడో తప్ప అతడు నెట్స్ లో కనిపించేవాడు కాదు. 

36

నేను ఒకసారి  ఏబీడీని ఇదే విషయం అడిగా. మీరు  ప్రాక్టీస్ కు ఎందుకు రారు..? అని. అప్పుడు డివిలియర్స్  నాతో.. ‘నేను నా చిన్నప్పుడు చాలా ప్రాక్టీస్ చేసేవాడిని.  అంతేగాక నా చిన్నతనంలో నేను నీ అంత టాలెంటెడ్ క్రికెటర్ ను కాదు..’అని నాతో అన్నాడ’ని   సర్ఫరాజ్ చెప్పాడు. 

46

ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడటానికంటే ముందు సర్ఫరాజ్ ఖాన్..   ఐపీఎల్ లో ఆర్సీబీకి ఆడాడు.   ఆ టీమ్ తో నాలుగు సీజన్లు  ఉన్నాడు.  ఈ క్రమంలో సర్ఫరాజ్.. క్రిస్ గేల్, ఏబీడీ,  విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లతో  డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు.  

56

కాగా అండర్ - 19 ప్రపంచకప్ నుంచి తిరిగివచ్చాక సర్ఫరాజ్  ను చాలా మంది అతడు రెడ్ బాల్ (టెస్టు క్రికెట్) కు పనికిరాడని చెప్పేవారట. వాళ్లకు సమాధానం చెప్పాలని తాను  కఠోర సాధన చేసినట్టు  సర్ఫరాజ్ తెలిపాడు.   ‘నేను ఐపీఎల్ లో  రెండు సీజన్లు ఆడిన తర్వాత చాలా మంది నా ఆట చూసి   నేను టెస్టులకు పనికిరానని అన్నారు. కానీ నేనేంటో నాకు తెలుసు.   

66

వారి విమర్శలను సీరియస్ గా తీసుకున్నా.  ముంబై రంజీ టీమ్ లోకి ఎంపికైన తర్వాత ఆడిన తొలి మ్యాచ్ లోనే ట్రిపుల్ సెంచరీ చేశాను.  ఆ తర్వాత కూడా నిలకడగానే ఆడుతున్నా. తొలి సెంచరీ చేసినప్పుడు  హెల్మెట్, బ్యాట్ పైకెత్తిన ఫీలింగ్ ను నేను ఎప్పటికీ మరిచిపోను.  అందరూ విమర్శిస్తుంటే   ముందు నేను కూడా రెడ్ బాల్ క్రికెట్ ఆడటం ఇంత కష్టమా..? అనిపించింది. కానీ తర్వాతే   తెలుసుకున్నా. హార్డ్ వర్క్  చేస్తే  అదేం పెద్ద  కష్టం  కాదని  అనిపించింది..’అని చెప్పుకొచ్చాడు. 

click me!

Recommended Stories