ఐదారేండ్లలో ఆ లీగ్‌లన్నీ కనుమరుగు.. ఐపీఎల్ మాత్రం.. : గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Feb 07, 2023, 01:54 PM IST

IPL: దేశానికో  క్రికెట్ లీగ్ పుట్టుకొస్తున్న క్రమంలో  వచ్చే ఐదారేండ్లంలో వాటిలో చాలా మట్టుకు  కనుమరుగైతాయని భారత  క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)  మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ  అన్నాడు. 

PREV
16
ఐదారేండ్లలో ఆ లీగ్‌లన్నీ కనుమరుగు.. ఐపీఎల్ మాత్రం.. : గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఫ్రాంచైజీ క్రికెట్ పుణ్యమా అని  గత కొన్నేండ్లుగా  దేశానికో క్రికెట్ లీగ్  పుట్టుకొస్తున్నది.   ప్రస్తుతం ఐసీసీ సభ్య దేశాలుగా ఉన్న  దాదాపు  ప్రతిదేశం.. తమ దేశంలో లీగ్  క్రికెట్ కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నవి.  ఈ లీగ్ ల షెడ్యూల్  ను బట్టే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)   మ్యాచ్   షెడ్యూల్ లను తయారుచేసే స్థితికి చేరిందంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. 

26

క్రికెట్ లో అగ్రదేశాలైన ఆస్ట్రేలియా  లో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్),  ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్),  ఇంగ్లాండ్ లో ది హండ్రెడ్ లు  చాలా ప్రాచుర్యం పొందాయి. వీటితో పాటు  వెస్టిండీస్ లో జరిగే  కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), బంగ్లాదేశ్  లో జరిగే  బంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్), పాకిస్తాన్ లో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)  లు  జరుగుతున్నాయి. 

36

ఇవి చాలవన్నట్టుగా  కొత్తగా ఈ ఏడాది దక్షిణాఫ్రికా లో సౌతాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఎ 20),   యూఏఈలో ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ఐఎల్ టీ20) లు  జరుగుతున్నాయి.  రాబోయే రోజుల్లో మరిన్ని లీగ్ లు పుట్టుకొచ్చే అవకాశలూ మెండుగా ఉన్నాయి.  అయితే ఇన్ని లీగ్ లు వస్తున్నా.. రాబోయే ఐదారేండ్లలో మాత్రం   నాలుగైదు లీగ్ మినహా మిగతావన్నీ కనుమరుగవుతాయని  దాదా అంటున్నాడు. 
 

46

గంగూలీ మాట్లాడుతూ.. ‘వచ్చే నాలుగేండ్లలో  కొన్ని క్రికెట్ లీగ్స్ మాత్రమే  అందుబాటులో ఉంటాయి.  అవి కూడా  క్రికెట్ బాగా పాపులర్ అయిన దేశాల్లో ఉంటాయి.    కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పుడు బాగానే  నడుస్తున్నా తర్వాత అవి కనుమరుగు కాక తప్పదు.  

56

ఎందుకంటే  జాతీయ జట్టు కంటే క్రికెట్ లీగ్స్ ముఖ్యం కాదనే విషయాన్ని  క్రికెటర్లు త్వరలోనే గ్రహిస్తారు. ఫ్రాంచైజీ క్రికెట్ కంటే దేశానికి ఆడటమే ముఖ్యమని వాళ్లు తెలుసుకుంటారు.  అయితే ఎన్ని లీగ్స్ వచ్చినా  ఐపీఎల్ మాత్రం ప్రత్యేకం.  భారత్ లో  భిన్నమైన వాతావరణంలో ఈ లీగ్ ను నిర్వహిస్తున్నారు. ఈ లీగ్ కు భవిష్యత్ ఉంది.  అలాగే బీబీఎల్ కూడా   సజావుగానే సాగుతోంది. ఇటీవల మొదలైన ఎస్ఎ 20 కూడా ఆసక్తిగానే ఉంది..’అని అన్నాడు. 

66

కొత్తగా వచ్చే లీగ్స్ లో ఆడేందుకు పలువురు క్రికెటర్లు ఆసక్తి చూపిస్తున్నారని  అందుకే లీగ్స్ వేలం ప్రక్రియలో  పోటీ కనిపిస్తుందని దాదా అన్నాడు.   ఆర్థికంగా నిలదొక్కుకోగలిగే లీగ్స్ మాత్రమే భవిష్యత్ లో కొనసాగుతాయని తెలిపాడు. క్రికెట్ ను ప్రోత్సహించే వ్యవస్థ ఉండటం చాలా ముఖ్యమని దాదా అభిప్రాయపడ్డాడు. 

click me!

Recommended Stories