సూర్యకుమార్ యాదవ్ కోసం ఛతేశ్వర్ పూజారాని తప్పిస్తున్నారా... ప్రయోగాల బాటలో టీమిండియా!...

First Published Feb 7, 2023, 1:50 PM IST

టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్, కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత జట్టు ఓ ప్రయోగ శాలగా మారింది. ఈ ప్రయోగాల వల్ల టీమిండియాకి కలిగిన లాభాల కంటే నష్టమే ఎక్కువ. అయినా ప్రయోగాలు చేయడం మాత్రం మానలేదు...

Rishabh Pant-Pujara

ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు. భారత జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ టెస్టు సిరీస్‌లో కనీసం రెండు టెస్టులు గెలవాల్సి ఉంటుంది...

Pujara-Gill

ముంబై ఇండియన్స్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేశారు సెలక్టర్లు. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఇషాన్ కిషన్ లేదా కెఎస్ భరత్‌లలో ఎవరో ఒకరు టెస్టు సిరీస్ ఆడడం ఖాయం...

Image credit: Getty

శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా తొలి టెస్టుకి దూరం కావడంతో అతని ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్‌ ఆడతాడని అనుకున్నారంతా. అయితే శుబ్‌మన్ గిల్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది..

Image credit: PTI

టీ20ల్లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ని టెస్టుల్లోకి తెచ్చేందుకు ఛతేశ్వర్ పూజారాని సైడ్ చేస్తున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రిషబ్ పంత్ గాయం కారణంగా తప్పుకోవడంతో పూజారా, విరాట్ కోహ్లీ వంట సీనియర్లే టీమిండియాకి కీలకంగా మారారు...
 

Cheteshwar Pujara

పూజారాకి ఆస్ట్రేలియాపై అదిరిపోయే రికార్డు ఉంది. 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల్లో టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచిన ఛతేశ్వర్ పూజారా, , 2020-21 ఆస్ట్రేలియా టూర్‌లో రిషబ్ పంత్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు..

పూజారాకి ఆస్ట్రేలియాపై అదిరిపోయే రికార్డు ఉంది. 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల్లో టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచిన ఛతేశ్వర్ పూజారా, , 2020-21 ఆస్ట్రేలియా టూర్‌లో రిషబ్ పంత్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు..

click me!