అతను తలుపులు బాదడం లేదు! వాటిని తగలబెట్టేస్తున్నాడు... సర్ఫరాజ్ ఖాన్‌పై అశ్విన్ కామెంట్...

Published : Jan 30, 2023, 11:32 AM IST

రంజీ ట్రోఫీలో రికార్డు లెవెల్ పర్ఫామెన్స్‌తో టీమిండియాలో ప్లేస్‌కి తీవ్రమైన పోటీ ఇస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. బంగ్లాదేశ్ టూర్‌కి, ఆ తర్వాత వచ్చే నెలలో ప్రారంభమయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవడం బీసీసీఐపై, సెలక్టర్లపై తీవ్ర విమర్శలు రావడానికి కారణమైంది...

PREV
15
అతను తలుపులు బాదడం లేదు! వాటిని తగలబెట్టేస్తున్నాడు... సర్ఫరాజ్ ఖాన్‌పై అశ్విన్ కామెంట్...

ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 37 మ్యాచులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్, 79.65 సగటుతో 3505 పరుగులు చేశాడు. ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌, ఫస్ట్ క్లాస్ సగటు విషయంలో ది గ్రేట్ సర్ డాన్ బ్రాడ్‌మెన్‌కి దగ్గర్లో ఉన్నాడు...

25

‘సర్ఫరాజ్ ఖాన్ గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి. సర్ఫరాజ్ ఖాన్‌ని సెలక్ట్ చేస్తారా? లేదా? అని చాలా పెద్ద జరుగుతోంది. అయితే అతను మాత్రం సెలక్షన్ గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు...

35
Sarfaraz Khan

2019-20 సీజన్‌లో 900 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, ఆ తర్వాతి సీజన్‌లోనూ 900లకు పైగా పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 600 పరుగులు చేసేశాడు. తన పర్ఫామెన్స్‌లతో సెలక్టర్లకు మరో ఆప్షన్ లేకుండా చేస్తున్నాడు...

45

గత మూడు సీజన్లలో సర్ఫరాజ్ ఖాన్ సగటు 100కి పైగా ఉంది. స్ట్రైయిక్ రేటు కూడా 100 దాటేసింది. అతను తన పర్ఫామెన్స్‌తో సెలక్టర్ల తలుపులు బాదడం కాదు, వాటిని తగలబెట్టేస్తున్నాడు. అయినా అతన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరం...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్...

55
Image credit: BCCI

ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు టెస్టు టీమ్‌లో చోటు ఇచ్చిన సెలక్టర్లు, సర్ఫరాజ్ ఖాన్‌ని మాత్రం పట్టించుకోలేదు...

click me!

Recommended Stories