సంజూ శాంసన్‌కి టీమిండియా ఏ కెప్టెన్సీ... టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేయనందుకు ఇలా కవర్ డ్రైవ్...

Published : Sep 16, 2022, 03:33 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్ పేరు లేకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. టీ20ల్లో టీమిండియా వికె్ కీపర్‌గా ఉన్న రిషబ్ పంత్ కంటే మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ సంజూ శాంసన్‌ని పట్టించుకోకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అతని అభిమానులు...  

PREV
16
సంజూ శాంసన్‌కి టీమిండియా ఏ కెప్టెన్సీ... టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేయనందుకు ఇలా కవర్ డ్రైవ్...
Sanju Samson Player of the match

సంజూ శాంసన్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో చోటు దక్కకపోవడంతో కేరళలోని తిరువనంతపురంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్‌‌లో నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు అతని అభిమానులు...

26

దీంతో సంజూ శాంసన్‌ అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కొత్త ఎత్తుగడ వేసింది బీసీసీఐ. ఇండియా ఏ, న్యూజిలాండ్ ఏ జట్ల మధ్య జరగబోయే వన్డే సిరీస్‌కి సంజూ శాంసన్‌కి కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ బోర్డు..

36
Sanju Samson

న్యూజిలాండ్ ఏ టీమ్‌తో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్‌కి భారత ఏ జట్టు కెప్టెన్‌గా ప్రియాంక్ పంచల్ వ్యవహరించాడు. అలాగే పృథ్వీ షాకి భారత్ ఏ జట్టుకి కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అయినప్పటికీ సంజూ శాంసన్‌ని కెప్టెన్‌గా నియమించడం వెనక, అతని అభిమానులను చల్లార్చేందుకు వేస్తున్న ఎత్తుగడగానే భావిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

46
sanju samson

న్యూజిలాండ్ ఏతో సెప్టెంబర్ 22 నుంచి 27 వరకూ మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది భారత్ ఏ జట్టు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచులన్నీ జరుగుతాయి. సెప్టెంబర్ 22న తొలి వన్డే, 25న రెండో వన్డే, 27న మూడో వన్డే జరుగుతాయి..

56
Image credit: Getty

సంజూ శాంసన్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, రాహుల్ చాహార్, కుల్దీప్ యాదవ్ వంటి భారత ప్లేయర్లు, టీమిండియా ఏ తరుపున ఆడబోతున్నారు.. 

66
Sanju Samson

భారత ఏ జట్టు: పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటిదార్, సంజూ శాంసన్ (కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, రాహుల్ చాహార్, తిలక్ వర్మ, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, నవ్‌దీప్ సైనీ, రాజ్ ఆనంద్ భవా

click me!

Recommended Stories