రోహిత్-కోహ్లీలను ఔట్ చేస్తే టీమిండియా ఫినిష్.. అఫ్గాన్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్

Published : Sep 16, 2022, 03:05 PM IST

Rohit Sharma-Virat Kohli: టీమిండియా వెటరన్స్, తాజా మాజీ సారథులు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ లపై అఫ్గానిస్తాన్ మాజీ సారథి అస్గర్ అఫ్గాన్  షాకింగ్ కామెంట్స్ చేశాడు.  వాళ్లిద్దరినీ ఔట్ చేస్తే టీమిండియా పని కథమేనని... 

PREV
18
రోహిత్-కోహ్లీలను ఔట్ చేస్తే టీమిండియా ఫినిష్.. అఫ్గాన్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ కు మూలస్తంబాలుగా ఉన్న   టీమిండియా తాజా మాజీ సారథులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ  లు ప్రపంచ క్రికెట్ లో ప్రమాదకర ఆటగాళ్లనడంలో ఏమాత్రం సందేహంలేదు. ఓపెనర్ గా హిట్ మ్యాన్, వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ కలిసి ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించారు. 

28

అయితే ఒకప్పుడు భారత్ కు సచిన్, గంగూలీ, ద్రావిడ్ మాదిరిగా ప్రస్తుతం  ఈ ఇద్దరూ కీలక బ్యాటర్లని.. రోహిత్, కోహ్లీలను ఔట్ చేస్తే టీమిండియా కథ ఫినిష్ అని అఫ్గానిస్తాన్ మాజీ సారథి అస్గర్  అఫ్గాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

38

తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో భాగంగా  ఇండియా క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న అఫ్గాన్.. తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడేప్పుడు రోహిత్-కోహ్లీల కోసం ఎలాంటి గేమ్ ప్లాన్ ను ఆచరించేవాళ్లో తెలిపాడు. తాము ఇండియాతో ఆడుతున్నప్పుడు కోహ్లీ, రోహిత్ లను ఔట్ చేయడం మీదే ఉండేదని అన్నాడు. 

48

ఇదే విషయమై అఫ్గాన్ మాట్లాడుతూ.. ‘ఇండియాతో మ్యాచ్ అంటేనే మా  మొదటి ప్రాధాన్యం  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఔట్  చేయడం.  వాళ్లిద్దరినీ ఔట్ చేస్తే సగం టీమిండియా  ఫినిష్ అయినట్టే అని భావించేవాళ్లం.  ప్రపంచంలో గొప్ప బ్యాటర్లైన వాళ్లిద్దరూ ఏ క్షణంలోఅయినా మ్యాచ్ ను మలుపు తిప్పగల సామర్థ్యం  కలిగినవాళ్లే..
 

58

వాళ్లిద్దరూ కుదురుకుంటే ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగలరు.  వీళ్లిద్దరూ ఉంటే మ్యాచ్ మా చేతుల్లో ఉండదని మాకు తెలుసు. అందుకే ఈ ఇద్దరిని ఔట్ చేయడం మీదే మా దృష్టి ఉండేది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ.  అతడు ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే అతడిని ఆపడం కష్టం.

68

రోహిత్ - కోహ్లీలను  వెనక్కిపంపితే వన్డేలలో టీమమిండియా  స్కోరును  100-120 పరుగుల వరకు తగ్గించగలం. టీ20లలో అయితే  60-70పరుగుల తగ్గించే అవకాశం మాకుండేది..’అని తెలిపాడు.

78

ఇక ఆసియా కప్ లో  రోహిత్ సేన ఓటములకు కారణం రవీంద్ర జడేజా లేకపోవడమే అని అస్గర్ చెప్పాడు.  ‘పేపర్ మీద చూస్తే రోహిత్ సేన ఆసియా కప్ లో బలంగా ఉంది.  జట్టు సమతుల్యం  బాగుంది. కానీ సూపర్-4 దశలో వాళ్లకు  రవీంద్ర జడేజా లేకపోవడం కోలుకోలేని లోటు.  అది టీమిండియాను తీవ్రంగా ప్రభావం చూపింది..’ తెలిపాడు. 
 

88

అయితే ఆసియా కప్ ఓడినంత మాత్రానా టీమిండియాను తక్కువగా అంచనా వేయడానికి లేదని, రాబోయే టీ20 ప్రపంచకప్ లో  తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. 
 

Read more Photos on
click me!

Recommended Stories