ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన కెప్టెన్ అంటిరి! ఆసియా కప్‌లోనే ఇలా అయిపోతే మున్ముందు ఎలాగమ్మా...

First Published Sep 7, 2022, 4:52 PM IST

ఐపీఎల్‌లో ఆడడం, టీమిండియాకి ఆడడం రెండూ ఒక్కటి కాదు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన ప్రతీ ఒక్కరూ, వరల్డ్ కప్ గెలవలేరు. అయితే వరల్డ్ కప్ గెలిచిన ఎంఎస్ ధోనీ, నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలవడంతో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్... ఫ్రాంఛైజీ క్రికెట్‌కి, భారత క్రికెట్‌కి మధ్య ఉన్న తేడాని గుర్తించలేకపోయారు. ఈ విషయంలో బీసీసీఐ బాస్‌లు సౌరవ్ గంగూలీ, జై  షా కూడా మినహాయింపు కాదు...

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించిన బీసీసీఐ, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ రోహిత్, ధోనీ చెప్పిన ప్లేయర్లనే సెలక్ట్ చేసింది. శిఖర్ ధావన్‌ని టీ20 వరల్డ్ కప్ ఆడించాలని విరాట్ కోహ్లీ ఎంత ప్రయత్నించినా కుదరలేదు...

rohit sharma

ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ భారీ అంచనాలతో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సూపర్ సక్సెస్ సాధించాడు. విరాట్ కోహ్లీ కూడా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అనే విషయం మరిచిపోకూడదు.

rohit sharma

అయితే ఆసియా కప్ 2022 టోర్నీలో మాత్రం రోహిత్ శర్మ, కెప్టెన్సీ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయలేకపోయాడు. మొదటి మూడు మ్యాచుల్లో బ్యాటుతో రాణించలేకపోయిన రోహిత్, నాలుగో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కెప్టెన్‌గా మాత్రం లంకను 170+ కొట్టకుండా నిలువరించలేకపోయాడు.

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు టీమ్ కాంబినేషన్ విషయంలో చాలా ప్రయోగాలు చేసింది భారత జట్టు. టీమ్‌ని నడిపించే విధానంలో ముంబై ఇండియన్స్ ఫార్ములానే వాడాడు రోహిత్ శర్మ. ఇషాన్ కిషన్ వంటి యంగ్ ప్లేయర్లు వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమైతే వారికి తర్వాతి మ్యాచ్‌లో చోటు ఉండదు...

అదే కిరన్ పోలార్డ్ వంటి సీనియర్లు ఎన్ని మ్యాచుల్లో విఫలమైనా వారికి సీజన్ మొత్తం ప్లేస్ ఉంటుంది. టీమ్ విషయంలోనూ జరిగింది అదే. టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుస్తున్నంత కాలం, ఎన్ని ప్రయోగాలు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఆసియా కప్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో రోహిత్, రాహుల్ ద్రావిడ్ చేసిన ప్రతీ పనిలోనూ తప్పులు వెతకడం మొదలెట్టారు అభిమానులు...

Rohit Sharma and KL Rahul

ట్రోల్స్ వచ్చాయని కాదు కానీ టీమిండియా చాలా విషయాల్లో స్పష్టత లేకుండా బరిలో దిగింది. దీపక్ హుడాని ద్వైపాక్షిక సిరీసుల్లో టాపార్డర్‌లో ఓపెనర్‌గా, టూ డౌన్ ప్లేయర్‌గా, ఆల్‌రౌండర్‌గా వాడింది భారత జట్టు. ఆసియా కప్‌లో మాత్రం అతన్ని ఫినిషర్‌ రోల్‌కి మార్చింది. బౌలింగ్‌ వేయించడానికి కూడా సాహసించలేదు...

రవీంద్ర జడేజా రూపంలో టోర్నీ మధ్యలో ఓ కీ ప్లేయర్‌ని కోల్పోయింది భారత జట్టు. జడ్డూ లేకుండా భారత జట్టు చాలా మ్యాచులు ఆడింది, నెగ్గింది కూడా. అయితే ముంబై ఇండియన్స్‌లో, టీమిండియాలో రోహిత్‌ ప్రధాన అస్త్రం జస్ప్రిత్ బుమ్రా. బుమ్రా లేకపోతే రోహిత్ నిరాయుధుడిగా మారిపోయాడు...

Image credit: Getty

బుమ్రా లేకపోయినా ఖలీల్ అహ్మద్, భువీ, షమీ వంటి బౌలర్లతో భారత జట్టు చాలా మ్యాచులు గెలిచింది. గెలవకలదు కూడా. అయితే ఇక్కడ రోహిత్ శర్మ మాత్రం బుమ్రా లేకుండా గెలవచ్చనే మైండ్‌సెట్ నుంచి బయటికి రాకపోవడమే భారత జట్టు ఓటమికి కారణమంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 

మరి ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన కెప్టెన్ రోహిత్, ఆసియా కప్‌కే ఇలా అయిపోతే... టీ20 వరల్డ్ కప్ 2022, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల్లో టీమిండియా టైటిల్ గెలవగలదనే నమ్మకాలు పెట్టుకోవచ్చా... అంటూ ట్రోల్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

click me!