అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోగా, బ్యాడ్ లక్ వచ్చి లిప్‌లాక్ పెట్టింది! సంజూ శాంసన్ గాయంపై జోక్స్...

Published : Jan 05, 2023, 04:23 PM IST

టీమిండియా తరుపున ఆడాలంటే టాలెంట్ ఒక్కటీ ఉంటే సరిపోదు... అంతకుమించి టన్నుల్లో అదృష్టం ఉండాలి. సత్తా ఉన్న క్రికెటర్‌గా మాజీ క్రికెటర్ల మన్ననలు అందుకున్న సంజూ శాంసన్, టీమిండియా తరుపున మాత్రం సరైన అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. రాకరాక వచ్చిన ఛాన్సులను శాంసన్ సరిగా వాడుకోలేకపోతున్నాడు...

PREV
16
అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోగా, బ్యాడ్ లక్ వచ్చి లిప్‌లాక్ పెట్టింది! సంజూ శాంసన్ గాయంపై జోక్స్...
Sanju Samson and Rishabh Pant

మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే వికెట్ కీపింగ్ బ్యాటర్ కోసం వెతుకులాట మొదలెట్టింది టీమిండియా.. రిషబ్ పంత్, సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది...

26
Sanju Samson

ఆరంభంలో అదరగొట్టిన రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించింది టీమిండియా మేనేజ్‌మెంట్. సంజూ శాంసన్ కెరీర్ ఆరంభంలో వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోలేకపోయాడు. దీంతో రిషబ్ పంత్‌కి బ్యాకప్ ప్లేయర్‌గా మాత్రమే మిగిలిపోయాడు...

36

టీమిండియాకి ప్రధాన వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా మారిన రిషబ్ పంత్ అనుకోకుండా కారు ప్రమాదంలో గాయపడి జట్టుకి దూరమయ్యాడు. పంత్‌ దూరం కావడంతో సంజూ శాంసన్‌కి వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారంతా..

46

అనుకున్నట్టుగానే శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు సంజూ శాంసన్. అయితే ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంజూ, టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. సంజూ శాంసన్ స్థానంలో జితేశ్ శర్మకు అవకాశం కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్...

56
Sanju Samson

రిషబ్ పంత్ కోలుకోవడానికి ఆరు నుంచి 9 నెలల వరకూ సమయం పడుతుందని అంచనా. దీంతో సంజూ శాంసన్‌కి వరుస అవకాశాలు వస్తాయని భావించారు ఫ్యాన్స్. అయితే అదృష్టం వచ్చి హగ్ ఇచ్చే లోపు, బ్యాడ్ లక్ వచ్చి లిప్‌లాక్ ఇచ్చినట్టు సంజూ శాంసన్ వరుస తయారయ్యిందని మీమ్స్ వైరల్ చేస్తున్నారు...

66
Sanju Samson

ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కి వికెట్ కీపర్‌ రిషబ్ పంత్ అందుబాటులో ఉండడం లేదు. దీంతో అతని స్థానంలో సంజూ శాంసన్‌‌‌కి అవకాశం దక్కుతుందా? లేక శ్రీకర్ భరత్‌ని టీమ్‌లోకి తీసుకొస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది...

click me!

Recommended Stories