నేను ఎక్కుదామని వెళ్తే ‘వర్జిన్’ వద్దంది.. షాక్‌కు గురయ్యా.. సామ్ కరన్‌కు చేదు అనుభవం

Published : Jan 05, 2023, 02:27 PM IST

Sam Curran: ఐపీఎల్ లో ఇటీవలే నిర్వహించిన మినీ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ఇంగ్లాండ్ ఆల్   రౌండర్ సామ్ కరన్ కు  చేదు అనుభవం ఎదురైంది.  ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నాడు.   

PREV
16
నేను ఎక్కుదామని వెళ్తే ‘వర్జిన్’ వద్దంది.. షాక్‌కు గురయ్యా..  సామ్ కరన్‌కు చేదు అనుభవం

గతేడాది ఇంగ్లాండ్  క్రికెట్ లో  పొట్టి ఫార్మాట్ లో  అదరగొట్టిన స్టార్ ఆల్ రౌండర్  సామ్ కరన్..  ఆ  జట్టు ప్రపంచకప్ నెగ్గడంలో  కీలక పాత్ర పోషించాడు.   ఇటీవలే ముగిసిన  ఐపీఎల్ మినీవేలంలో కూడా అతడిపై కాసుల వర్షం కురిసింది. కరన్ ను దక్కించుకునేందుకు   గాను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 18.50 కోట్లు వెచ్చించింది.  

26

తాజాగా ఈ   ఆల్ రౌండర్ కు   చేదు అనుభవం ఎదురైంది.   అతడు విమానం ఎక్కేందుకు వెళ్లగా  సిబ్బంది అందుకు అడ్డుకున్నారు.  తాను ప్రయాణం చేసేందుకు గాను టికెట్ బుక్ అయినా తనను విమానంలోకి అనుమతించలేదని  ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

36

వివరాల్లోకెళ్తే..  సామ్ కరన్   బ్రిటిష్ ఎయిర్లైన్స్ ‘వర్జిన్ అట్లాంటిక్’ విమానంలో  ప్రయాణిచేందుకు టికెట్ బుక్ అయింది.  తీరా తాను ప్రయాణం చేసేందుకు విమానాశ్రయానికి వెళ్లగా ‘వర్జిన్’ సిబ్బంది అతడిని  అందుకు అనుమతించలేదు.  ఎందుకని   అతడు ఆరా తీయగా సీటు విరిగిపోయిందని  చెప్పారు. దీంతో అతడు షాక్ కు గురయ్యాడు. 

46

ఇదే విషయమై  సామ్ కరన్ తన ట్విటర్ లో స్పందిస్తూ.. ‘వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ ఎక్కేందుకు నేను విమానాశ్రయానికి వెళ్లాను. కానీ  సిబ్బంది నన్ను అందుకు అనుమతించలేదు.  విమానంలో నేను కూర్చోవాల్సిన సీటు విరిగిపోయిందట.. అందుకే అందులో ప్రయాణించడానికి వీళ్లేదని చెప్పారు.  క్రేజీగా ఉంది కదా.   ఇది నన్ను విస్మయానికి గురి చేసింది..  చాలా ఇబ్బందిగా కూడా ఉంది..’ అని  పేర్కొన్నాడు. 

56

కరన్ ట్వీట్ వైరల్ కావడంతో వర్జిన్ అట్లాంటిక్ స్పందించింది.. ‘హాయ్ సామ్, మీకు అలా జరగడం చాలా బాధాకరం. కానీ మీరు  అక్కడ్నుంచి వచ్చే ముందు మా కస్టమర్ కేర్ సిబ్బందితో   మాట్లాడాల్సి ఉంటే బాగుండేది.   వాళ్లు మిమ్మల్ని గైడ్ చేసేవారు..’  అని  తెలిపింది.  

66

కాగా  ఐపీఎల్ వేలంలో  కరన్ రికార్డులు సృష్టించాడు.  గతంలో  క్రిస్ మోరిస్ పేరిట ఉన్న అత్యధిక  ధర (రూ. 16.25 కోట్ల రికార్డు) ను  కరన్ బద్దలుకొట్టాడు.  కరన్  ను దక్కించుకునేందుకు ముంబై ఇండియన్స్,  ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ లు పోటీ పడ్డాయి. కానీ చివరికి పంజాబ్ కింగ్స్.. అతడిని  రూ. 18.50 కోట్లకు దక్కించుకుంది. 

click me!

Recommended Stories