ఎందుకు సెలక్ట్ చేయడం లేదో అర్థం కాక ఏడ్చేశా! అతన్ని అడిగితే... - సర్ఫరాజ్ ఖాన్...

First Published Jan 16, 2023, 11:48 AM IST

రంజీ ట్రోఫీలో రికార్డు లెవెల్లో పరుగుల వరద పారిస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. 2019-20 సీజన్‌లో 154.66 యావరేజ్‌తో 928 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, 2021-22 సీజన్‌లో 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 89 యావరేజ్‌తో 801 పరుగులు చేశాడు...

ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 80.47 యావరేజ్‌తో పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, సర్ డాన్ బ్రాడ్‌మెన్ తర్వాత మెరుగైన ఫస్ట్ క్లాస్ యావరేజ్‌ని నమోదు చేశాడు. అయితే రంజీ ట్రోఫీలో ఇంతలా అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కి టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు దక్కడం లేదు...
 

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోని సర్ఫరాజ్ ఖాన్, వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులోనూ స్థానం సంపాదించుకోలేకపోయాడు.. రంజీల్లో ఇలాంటి రికార్డు ఉన్నా సర్ఫరాజ్ ఖాన్‌ని సెలక్ట్ చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి..

Sarfaraz Khan

‘ఆస్ట్రేలియాతో సిరీస్‌కి జట్టుని ఎంపిక చేసినప్పుడు అందులో నా పేరు లేకపోవడం చూసి చాలా బాధపడ్డాను. నా స్థానంలో ఎవ్వరున్నా బాధపడతారు. ఎందుకంటే నాకు ఈసారి పిలుపు వస్తుందని ఆశించాను. కానీ రాకపోవడంతో చాలా ఫీలయ్యాను...

Sarfaraz Khan

నిన్న కూడా రోజంతా బాధపడుతూ కూర్చున్నా. గౌహతి నుంచి ఢిల్లీకి వచ్చే దారిలోనూ దీని గురించే ఆలోచిస్తూ ఉన్నా. చాలా ఒంటరితనంగా ఫీలయ్యాను. ఏం చేయాలో తెలియక ఏడ్చేశాను. అయితే ఏడుస్తూ కూర్చుంటే అక్కడితో ఉండిపోతామని నాకు నేను సర్ధిచెప్పుకున్నా...

Image credit: BCCI

బెంగళూరులో జరిగిన గత రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ చేసిన తర్వాత సెలక్టర్లను కలిశాను. అప్పుడు వాళ్లు బంగ్లాదేశ్‌తో సిరీస్‌కి నిన్ను ఎంపిక చేస్తామని, సిద్ధంగా ఉండాలని చెప్పారు. అయితే ఆ సిరీస్‌లో నాకు అవకాశం దక్కలేదు...

ఈ మధ్య ముంబైలో చేతన్ శర్మ సర్‌ని మళ్లీ కలిశాను. అప్పుడు ఆయన ఫీల్ అవ్వొద్దని, నీకు కూడా సమయం వస్తుందని భరోసా ఇచ్చారు. మంచి పనులు జరగడానికి కాస్త సమయం పడుతుందని చెప్పారు. మరోసారి నాకు నిరాశే ఎదురైంది. అందుకే చాలా బాధపడ్డాను.. ’ అంటూ చెప్పుకొచ్చాడు ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్...

వన్డే, టీ20ల్లో రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కి టెస్టుల్లో అవకాశం కల్పించిన సెలక్టర్లు, గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్, కెఎస్ భరత్‌లను వికెట్ కీపింగ్ బ్యాటర్లను ఆస్ట్రేలియాతో మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేశారు... సర్ఫరాజ్ ఖాన్‌ని మాత్రం పట్టించుకోలేదు... 

click me!