సిరాజ్ రాటుదేలాడు.. భారత్‌కు ఆ బెంగ తీరుస్తున్నాడు.. మియాపై హిట్‌మ్యాన్ ప్రశంసలు

First Published Jan 16, 2023, 10:59 AM IST

INDvsSL ODI: టీమిండియా యువ పేసర్, హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ పై భారత క్రికెట్ జట్టు  సారథి  రోహిత్ శర్మ  ప్రశంసలు కురిపిస్తున్నాడు.   గతంతో పోలిస్తే సిరాజ్ రాటుదేలుతున్నాడని కొనియాడాడు. 

జట్టులోకి వచ్చిన ఆనతి కాలంలోనే హైదరాబాద్ పేసర్  మహ్మద్ సిరాజ్  కీలక బౌలర్ గా మారాడు.  గతంలో టెస్టులలో మాత్రమే కనిపించే ఈ యువ పేసర్ గత ఏడాదికాలంగా  వన్డేలలో  కూడా కనిపిస్తున్నాడు. బుమ్రాకు గాయాలు, షమికి ఫిట్నెస్ తో  సిరాజ్ కు ఇండియా ఏ తో పాటు  ప్రధాన జట్టులో కూడా వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. ఆ అవకాశాలను  సిరాజ్ చక్కగ సద్వినియోగం చేసుకుంటున్నాడు.  

Image credit: PTI

తాజాగా శ్రీలంకతో  వన్డే సిరీస్ లో కూడా  సిరాజ్ అదరగొట్టాడు.  తొలి రెండు వన్డేలలో కీలక వికెట్లు తీసిన సిరాజ్.. మూడో వన్డేలో లంక భారీ లక్ష్యం ఛేదించాల్సి ఉండగా   ఆదిలోనే ఆ ఆలోచనను తుంచేశాడు.  బంతిని తాకితే  క్యాచ్.. మిస్ అయితే  వికెట్ క్లీన్ బౌల్డ్ అన్నంత  రేంజ్ లో నిన్న సిరాజ్ విధ్వంసం సాగింది. తిరువనంతపురంలో ముగిసిన మూడో వన్డేలో సిరాజ్.. 10 ఓవర్లు వేసి  ఓ మెయిడిన్ వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ ధాటికి  లంక.. 73 పరుగులకే పరిమితమైంది.
 

మ్యాచ్ అనంతరం  సిరాజ్ పై రోహిత్  ప్రశంసలు కురిపించాడు.  సిరాజ్ గురించి చెబుతూ.. ‘గత కొన్ని రోజులుగా సిరాజ్ లో చాలా మార్పు వచ్చింది. అతడు రోజురోజుకూ రాటుదేలుతున్నాడు. బాల్ ను చక్కగా స్వింగ్ చేస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్ చేసేప్పుడు అతడి రనప్ చూస్తుంటేనే అందులో  ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. 

కొత్త కొత్త ట్రిక్స్ తో సిరాజ్ పవర్ ప్లేలో కీలక వికెట్టు పడగొట్టి  జట్టు విజయాల్లో కీలకంగా నిలుస్తున్నాడు.   టీమిండియాకు గత కొన్నాళ్లుగా   పవర్ ప్లేలో వికెట్లు తీసే  బౌలర్ కరువయ్యాడు.  కానీ  ఆ సమస్యకు సిరాజ్ చెక్ పెట్టాడు..’ అని హిట్ మ్యాన్ తెలిపాడు. 

అయితే   నిన్నటి మ్యాచ్ లో సిరాజ్ నాలుగు వికెట్లు తీసి ఐదో వికెట్ కోసం తీవ్రంగా యత్నించాడు.    సిరాజ కు ఐదో వికెట్ కోసం  రోహిత్ కూడా అతడికి తగ్గట్టుగా ఫీల్డింగ్ ను సెట్ చేశాడు.  కానీ  చివరివరకూ యత్నించినా అతడికి వికెట్ దక్కకపోవడంతో తాను కూడా నిరాశకు గురయ్యానని  రోహిత్ చెప్పాడు. 

‘వన్డేలలో స్లిప్ ఫీల్డర్లను పెట్టి బౌలింగ్ చేయడం చాలా తక్కువ.  కానీ సిరాజ్ బౌలింగ్ లో  జోరు చూసేసరికి  స్లిప్ లో ఫీల్డర్లను మొహరించి అతడికి సాయపడాలని అనిపించింది.  ఈ మ్యాచ్ లో సిరాజ్ కు ఐదో వికెట్ దక్కాలని  చాలా కష్టపడ్డాం.  కానీ దురదృష్టవశాత్తూ  అది దక్కలేదు..’ అని తెలిపాడు. 

మ్యాచ్ అనంతరం సిరాజ్ తన బౌలింగ్ గురించి స్పందిస్తూ.. ‘గత కొన్నాళ్లుగా నా రిథమ్ బాగుంది.   అవుట్ స్వింగర్ నా ఆయుధంగా పనిచేస్తోంది.  కొత్తగా బంతిని వికెట్ల లోపలికి మూవ్  చేసేందుకు యత్నిస్తున్నా.  నేడు  నాలుగు వికెట్లు తీయడం సంతోషంగా ఉంది. ఐదో వికెట్ కోసం యత్నించా గానీ  కుదరలేదు. రోహిత్ భాయ్ కూడా  నా ఐదో వికెట్ కోసం  ప్రయత్నిచాడు. కానీ కుదర్లేదు..’ అని చెప్పుకొచ్చాడు. 

click me!