Sanju Samson
కెరీర్ ఆరంభంలో ఎమ్మెస్ ధోనీ కారణంగా వైట్ బాల్ క్రికెట్‌లో చోటు దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్, ఆ తర్వాత రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ కారణంగా తుది జట్టులోకి రాలేకపోతున్నాడు.. వచ్చిన అరకోర అవకాశాలను వాడుకున్నా, సంజూని పూర్తిగా వాడుకోవాలనే ఉద్దేశం మాత్రం టీమిండియాకి ఉన్నట్టు కనిపించడం లేదు..
వాస్తవానికి సంజూ శాంసన్‌కి కౌంటీల్లో ఆడే అవకాశం దక్కింది. త్వరలో కౌంటీ క్లబ్ కాంట్రాక్ట్ ఖాయమవుతుందనగా ఆసియా కప్ 2023 టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు సంజూ శాంసన్. దీంతో కౌంటీల్లో ఆడాలనే ఆలోచనను విరమించుకున్నాడు..
Sanju Samson
కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి, సూపర్ 4 మ్యాచ్‌ల కోసం శ్రీలంకకు రావడంతో సంజూ శాంసన్, స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. కెఎల్ రాహుల్ కోలుకోకపోతే, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి రిజర్వు ప్లేయర్‌గా సంజూని ఆడించాలని అనుకుంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ.
ఈ కారణంగానే చైనాలో జరగాల్సిన ఆసియా క్రీడలకు కూడా సంజూ శాంసన్‌ని ఎంపిక చేయలేదు. కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడం, ఇషాన్ కిషన్ కూడా మిడిల్ ఆర్డర్‌లో కుదురుకుపోవడం సంజూ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది..
తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో కూడా సంజూ శాంసన్‌కి చోటు దక్కలేదు. వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కి వరుసగా అవకాశాలు ఇస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్, సంజూని పట్టించుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..
Sanju Samson-Suryakumar Yadav
గత 8 వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ 4 సార్లు డకౌట్ అయ్యాడు. మిగిలిన మ్యాచుల్లో 35+ పరుగుల మార్కు కూడా దాటలేకపోయాడు. అయినా టీ20ల్లో నెం.1 బ్యాటర్ కావడం వల్లే సూర్యకుమార్ యాదవ్‌ని ఏకంగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసింది టీమిండియా...
Sanju Samson
మరోవైపు సంజూ శాంసన్ ఈ ఏడాది ఆడినగత 8 వన్డేల్లో రెండు హాఫ్ సెంచరీలతో 43*, 15, 86*, 30, 2*, 36, 9, 51 పరుగులు చేశాడు. అయితే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్... సంజూని ఫ్యూచర్ ప్లాన్స్‌లో భాగం చేయడం లేదు..
Irfan Pathan and Sanju Samson
‘సంజూ శాంసన్ ప్లేస్‌లో నేను ఉంటే, కచ్ఛితంగా చాలా నిరుత్సాహపడేవాడిని... వన్డేల్లో బాగా ఆడుతున్నా కూడా అతన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం.’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...