ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా ఆడింది ఆరు మ్యాచులు. అందులో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి వచ్చింది 3 మ్యాచుల్లో మాత్రమే. రోహిత్ శర్మ అన్ని మ్యాచులు ఆడినా ఫైనల్‌లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు...
Virat Kohli-Rohit Sharma
జూలై 2023 నుంచి భారత జట్టు ఇప్పటిదాకా 9 వన్డేలు ఆడితే అందులో విరాట్ కోహ్లీ 3 సార్లు, రోహిత్ శర్మ 6 సార్లు మాత్రమే బ్యాటింగ్ చేశారు. శుబ్‌మన్ గిల్ మాత్రమే 9 సార్లు బ్యాటింగ్‌కి వచ్చాడు. అలాంటిది వరల్డ్ కప్‌కి ముందు వీళ్లకు రెస్ట్ ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు కొందరు ఫ్యాన్స్..
అయితే ఇంతకుముందు 2011 వన్డే వరల్డ్ కప్‌కి ముందు కూడా ఇదే ఫార్ములాని వాడింది టీమిండియా. 2010 నుంచి 2011 వన్డే వరల్డ్ కప్ వరకూ టీమిండియా 32 వన్డేలు ఆడింది. అయితే ఇందులో సచిన్ టెండూల్కర్ ఆడిన మ్యాచులు నాలుగంటే నాలుగే..
Image credit: PTI
వరల్డ్ కప్‌కి ముందు నాలుగు మ్యాచులే ఆడిన సచిన్ టెండూల్కర్, 2011 వన్డే వరల్డ్ కప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 482 పరుగులు చేసి టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు..
Image credit: PTI
అలాగే వీరేంద్ర సెహ్వాగ్ కూడా 12 మ్యాచులు మాత్రమే ఆడాడు.2011 ప్రపంచ కప్‌లో సెహ్వాగ్ 8 ఇన్నింగ్స్‌ల్లో 380 పరుగులు చేశాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలోనూ ఇదే ఫార్ములా వాడుతోంది టీమిండియా..
Image credit: PTI
‘ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం భారత జట్టు మూడు మ్యాచుల కోసం మూడు నగరాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. వరల్డ్ కప్‌కి ముందు ఇలాంటి మ్యాచులు ఆడడం వల్ల అలిసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది..
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ పెట్టాలనుకుంటే, వరల్డ్ కప్‌కి ముందు కనీసం 10 రోజుల ముందు పెట్టాల్సింది. ఇప్పుడు సీనియర్లకు రెస్ట్ ఇవ్వడమే మంచిది...
దీని వల్ల వాళ్లు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొనడానికి సమయం దొరుకుతుంది. అలాగే ప్రయాణించాల్సిన అవసరం కూడా ఉండదు..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం ఆక్రమ్..
ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేలో రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టుతో కలుస్తారు. మొదటి రెండు వన్డేలు ఆడే రుతురాజ్ గైక్వాడ్, ఆసియా క్రీడల కోసం చైనాకి వెళ్తాడు.