ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి రెస్ట్ ఇవ్వడంతో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కి అవకాశం దక్కింది. అయితే వస్తున్న అరకోర అవకాశాలను ఒడిసిపట్టుకోవడంలో విఫలమవుతున్నాడు శాంసన్...
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టాపార్డర్‌లో శిఖర్ ధావన్ 97, శుబ్‌మన్ గిల్ 64, శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులతో రాణించి హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ 350+ స్కోరు చేయలేకపోయింది భారత జట్టు... దీనికి ప్రధాన కారణం మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్...
27
Image credit: PTI
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 13, సంజూ శాంసన్ 12 పరుగులు చేసి అవుట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన భారత జట్టు 308 పరుగులకే పరిమితమైంది...
37
Sanju Samson
వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొట్టినా ఆఖరి ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ మ్యాజిక్ కారణంగా చావు తప్పి కన్నులొట్టబోయిన్టటుగా 3 పరుగుల తేడాతో విజయం సాధించగలిగింది టీమిండియా...
47
‘సంజూ శాంసన్ మరో అవకాశాన్ని వృధా చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతని నుంచి స్పెషల్ ఇన్నింగ్స్ రాలేదు. పరుగులు రాకపోయినా క్రీజులోకి వచ్చినప్పుడు జోష్ ఉంటే చూడడానికి బాగుంటుంది...
57
Sanju Samson
అయితే రొమారియో షిఫర్డ్ అవుట్ చేసే ముందు వరకూ కూడా క్రీజులో చాలా నీరసంగా కదిలాడు సంజూ శాంసన్. అందుకే సంజూ శాంసన్ కంటే దీపక్ హుడాని ముందు పంపించి ఉంటే బాగుండేది...
67
Sanju Samson
శ్రేయాస్ అయ్యర్ మూడో స్థానంలో పర్ఫెక్ట్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ సరిపోతాడు. శాంసన్ కంటే ముందు దీపక్ హుడాని పంపించి ఉంటే మరిన్ని పరుగులు వచ్చి ఉండేవి...
77
Sanju Samson
రిషబ్ పంత్ టాపార్డర్‌లో మ్యాజిక్ చేసినట్టు సంజూ శాంసన్ చేయలేకపోయాడు. అతని బ్యాటింగ్ స్టైల్ వేరు. శాంసన్ ఎప్పటికీ రిషబ్ పంత్ కాలేడు. ఎందుకంటే రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో, అతనిలో ఉండే యాటిట్యూడ్... సంజూలో కనిపించడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా...