ఇప్పుడు కూడా ఫెయిల్ అయితే ఇక సంజూ శాంసన్‌ని ఎవ్వరూ కాపాడలేరు.. - మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి

Published : Jun 25, 2023, 03:52 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత రిషబ్ పంత్‌, టీమ్‌లో కుదురుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ సమయంలో కేరళ యంగ్‌స్టర్ సంజూ శాంసన్‌కి కూడా కొన్ని అవకాశాలు ఇచ్చింది టీమిండియా. అయితే ఆ అవకాశాలను వాడుకోవడంలో సంజూ విఫలమయ్యాడు..

PREV
18
ఇప్పుడు కూడా ఫెయిల్ అయితే ఇక సంజూ శాంసన్‌ని ఎవ్వరూ కాపాడలేరు.. - మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి
Sanju Samson

టీ20ల్లో 226 మ్యాచులు, ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 55 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, టీమిండియా తరుపున ఆడింది 27 మ్యాచులే. అప్పుడెప్పుడో 2015లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్‌కి తిరిగి 2019లో పిలుపు వచ్చింది..

28

2019 డిసెంబర్‌లో రిషబ్ పంత్‌ ప్లేస్‌లో శ్రీలంక సిరీస్‌కి ఎంపికైన సంజూ శాంసన్, తాను ఎదుర్కొన్న మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. శిఖర్ ధావన్ గాయాలతో సంజూ శాంసన్‌కి ఇంకోసారి ఛాన్స్ దక్కింది..

38

న్యూజిలాండ్ సిరీస్‌లోనూ భారీ స్కోర్ చేయలేకపోయిన సంజూ శాంసన్, ధోనీ రిటైర్మెంట్ తర్వాత 2021 నుంచి టీమ్‌లోకి వస్తూ పోతూ ఉన్నాడు. గత ఏడాది జూన్‌లో దీపక్ హుడాతో కలిసి 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంజూ శాంసన్, టీ20ల్లో టీమిండియా తరుపున అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పాడు..

48

అయితే ఆ తర్వాత కూడా సంజూ శాంసన్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో మొదటి హాఫ్ సెంచరీ చేసిన సంజూ శాంసన్, జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో 43 పరుగులు చేసి 3 క్యాచులతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు..

58

సౌతాఫ్రికాతో మూడో వన్డేలో 63 బంతుల్లో 86 పరుగులు చేసిన సంజూ శాంసన్, టీమిండియాకి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఐపీఎల్‌లో దాదాపు 3900 పరుగులు చేసిన సంజూ శాంసన్‌కి వెస్టిండీస్ టూర్‌లో వన్డే సిరీస్‌లో చోటు దక్కింది..
 

68

‘సంజూ శాంసన్‌ తానేం చేయగలడో, తన సత్తా ఏంటో ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు... అతను చాలా అరుదైన మ్యాచ్ విన్నర్. అయితే అతనిలో ఏదో మిస్ అవుతోంది. అతను కెరీర్ అసంపూర్తిగా ముగిస్తే మాత్రం నేను చాలా ఫీల్ అవుతాను...

78
Sanju Samson

సంజూ శాంసన్‌ దగ్గర ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. వాటిని ప్రపంచం మొత్తం చూడాలి. రోహిత్ శర్మను టెస్టు ఓపెనర్‌గా చేసేటప్పుడే అనుకున్నా, అతను టెస్టుల్లో సక్సెస్ కాకపోతే నేను ఫెయిల్ అయినట్టేనని... రోహిత్ నన్ను నిరుత్సాహపరచలేదు..

88
Sanju Samson

సంజూ శాంసన్‌లో కూడా అంతే టాలెంట్ ఉంది. కావాల్సిందంతా కాస్త మోటివేషన్. అది ఎవరు ఇస్తారో, ఎలా వస్తుందో తెలీదు కానీ అతను టీమ్‌లో సెటిల్ అయితే మాత్రం లెజెండరీ ప్లేయర్‌గా మారతాడు.. అతనికి ఇంకా పదేళ్ల కెరీర్ ఉంది.. వెస్టిండీస్ సిరీస్‌ని కూడా వృథా చేసుకుంటే అతని కెరీర్‌ని ఎవ్వరూ కాపాడలేరు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. 

click me!

Recommended Stories