తొలి సెంచ‌రీతో సంజూ శాంస‌న్ సాధించిన రికార్డులు ఇవే

First Published | Oct 12, 2024, 11:12 PM IST

Sanju Samson : భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ దసరా రోజు హైదరాబాద్‌లో పరుగుల ప‌టాసులు పేల్చాడు. బంగ్లాదేశ్‌పై ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. ఆ వివ‌రాలు మీకోసం

Sanju Samson: హైదరాబాద్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జ‌ట్లు మూడో టీ20 మ్యాచ్ ను ఆడాయి. ఈ మ్యాచ్ లో సంజూ శాంస‌న్ దెబ్బ‌కు క్రికెట్ అనేక రికార్డులు బ‌ద్ద‌లు అయ్యాయి. సంజు శాంసన్ అద్భుత‌ సెంచరీతో బంగ్లాదేశ్ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. అతని బ్యాటింగ్ హిట్టింగ్ తో బంగ్లా బౌల‌ర్ల‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. దసరా రోజు హైదరాబాద్‌లో పరుగుల ప‌టాసులు పెల్చాడు సంజూ శాంస‌న్.

బంగ్లాదేశ్‌పై టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. ఒక ఓవ‌ర్ లో వరుసగా 4 ఫోర్లు, మ‌రో ఓవ‌ర్ లో వ‌రుస‌గా 5 సిక్సర్లు సంజూ శాంస‌న్ ఇన్నింగ్స్ లో హైలెట్ గా నిలిచాయి. కేవ‌లం 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన సంజూ శాంస‌న్.. త‌న‌ తుఫాను ఇన్నింగ్స్‌తో అనేక క్రికెట్ రికార్డులు సాధించాడు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి..
 

హైదరాబాద్‌లో సంజూ శాంస‌న్ ప‌రుగులు సునామీ 

శాంసన్ గత నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఈ సమయంలో అతను రెండుసార్లు సున్నా ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు. కానీ, ఈసారి స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టిస్తూ సంచ‌లన ఇన్నింగ్స్ ఆడాడు. దసరా రోజు ఫోర్లు, సిక్సర్ల ప‌టాసులు కాల్చాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులను ఫోర్లు, సిక్సర్ల వ‌ర్షంలో త‌డిసారు.

శాంసన్ ఇటీవలి కాలంలో భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన ఆటగాడిగా పేరు పొందాడు, అయితే అతను తన ప్రతిభకు ఎప్పుడూ న్యాయం చేయలేదనే క్రికెట్ వ‌ర్గాల టాక్. త‌న‌ బ్యాడ్ టైమ్ అయిపోయిందని ఈ ఇన్నింగ్స్‌తో నిరూపించాడు. 


40 బంతుల్లో సెంచరీ కొట్టిన సంజూ శాంస‌న్ 

భార‌త ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సంజూ శాంసన్ తన బ్యాట్ ను ఝులిపించాడు. రెండో ఓవర్‌లో బంగ్లాదేశ్ బౌల‌ర్ టాస్కిన్ బౌలింగ్ లో ఒక‌ ఓవర్‌లో వరుసగా 4 ఫోర్లు బాదాడు. అంత‌టితో ఆగ‌కుండా త‌న బ్యాట్ వ‌ప‌ర్ ను చూపించాడు. కేవ‌లం 22 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన అతను 50 పరుగుల మార్కును ఈ మ్యాచ్ లో అందుకున్నాడు. అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో సంబ‌రాలు చేసుకున్నాడు. అంత‌టితో ఆగ‌కుండా సంజూ శాంస‌న్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాదాడు. స్పిన్నర్ రిషద్ హుస్సేన్ వేసిన తొలి బంతికి ప‌రుగులు రాలేదు కానీ, ఆ త‌ర్వాతి ఐదు బంతుల‌ను వరుసగా 5 సిక్సర్లు బాదాడు. ఈ ఓవ‌ర్ లో 30 ప‌రుగులు రాబ‌ట్టాడు. శాంసన్ 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 

Sanju Samson

236.17 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసిన సంజూ శాంస‌న్

40 బంతుల్లో సెంచ‌రీ చేసిన సంజూ శాంస‌న్.. మొత్తంగా 47 బంతుల్లో 111 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. త‌న ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. 236.17 స్ట్రైక్ రేట్ తో ప‌రుగులు చేశాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ వేసిన బంతికి మెహదీ హసన్ మిరాజ్ క్యాచ్ పట్టాడు. శాంసన్ అవుట్ అయిన తర్వాత, కెప్టెన్ సూర్య అతని వద్దకు వెళ్లాడు. కొంత స‌మ‌యం అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు. అత‌న్ని కౌగిలించుకున్న త‌ర్వాత శాంసన్ తిరిగి పెవిలియన్‌కు చేరుకున్నాడు. సూర్య తన కెప్టెన్సీలో శాంసన్‌పై చాలా నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు సంజూ ఆ న‌మ్మ‌కాన్ని వృధా చేయనివ్వలేదు.

అంతర్జాతీయ టీ20లో భారత్ తరఫున ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

36 - యువరాజ్ సింగ్ vs స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్), డర్బన్, 2007
36 - రోహిత్ శర్మ, రింకు సింగ్ vs కరీం జనత్ (ఆఫ్ఘనిస్తాన్), బెంగళూరు, 2024
30 - రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ vs గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా), గౌహతి, 2023
30 - సంజూ శాంసన్ vs రిషద్ హుస్సేన్ (బంగ్లాదేశ్), హైదరాబాద్, 2024
29 - రోహిత్ శర్మ vs మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), సెయింట్ లూసియా, 2024

టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ రికార్డులు-సంజూ శాంస‌న్ ఏ స్థానంలో ఉన్నాడంటే?

హైద‌రాబాద్ లో సంజూ శాంసన్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ ప్లేయ‌ర్ల జాబితాలో చోటు సంపాదించాడు. అంత‌ర్జాతీయ‌ టీ20లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాల్గవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ లిస్టులో దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 2017లో బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. భారత్ తరఫున రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ 35 బంతుల్లో సెంచరీ కొట్టాడు. 

టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీలు 

35 బంతులు - డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) vs బంగ్లాదేశ్, పోచెఫ్‌స్ట్రూమ్, 2017
35 బంతులు - రోహిత్ శర్మ (భారతదేశం) vs శ్రీలంక, ఇండోర్, 2017
39 బంతులు - జాన్సన్ చార్లెస్ (వెస్టిండీస్) vs దక్షిణాఫ్రికా, సెంచూరియన్, 2023
40 బంతులు - సంజు శాంసన్ (భారతదేశం) vs బంగ్లాదేశ్, హైదరాబాద్, 2024
42 బంతులు – హజ్రతుల్లా జజాయ్ (ఆఫ్ఘనిస్తాన్) vs ఐర్లాండ్, డెహ్రాడూన్, 2019
42 బంతులు – లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లాండ్) vs పాకిస్తాన్, ట్రెంట్ బ్రిడ్జ్, 2021

Latest Videos

click me!