సానియా మీర్జా ఇఫ్తార్ పార్టీలో కనిపించని షోయబ్ మాలిక్... విడాకులు నిజమేనా! ఆమెతో స్మిమ్మింగ్ పూల్‌లో...

First Published | Apr 7, 2023, 4:04 PM IST

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకుల గురించి దాదాపు ఆరు నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి వెళ్లాయని, విడాకులు కూడా తీసేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ ఆ మధ్య ఓ టాక్ షో అనౌన్స్ చేశారు సానియా మీర్జా- షోయబ్ మాలిక్...

సానియా మీర్జా- షోయబ్ మాలిక్‌తో కలిసి ‘ది మీర్జా మాలిక్ షో’ పేరుతో ఊర్దూఫ్లిక్స్ అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రకటించింది. దానికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. యూబ్యూట్‌‌లో నాలుగైదు ఎపిసోడ్‌లో విడుదల చేసినా జనాలు పట్టించుకోలేదు...

ఈ షోకి పాపులారిటీ, క్రేజ్ తీసుకురావడానికే సానియా మీర్జా- షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తను కావాలని ప్రచారం చేశారని కూడా అన్నారు. అయితే ఏమైందో ఏమో కానీ సానియా మీర్జా పోస్టుల్లో చాలా రోజులుగా షోయబ్ మాలిక్‌ కనిపించడం ఆపేశాడు...


ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలతో పాటు భర్త షోయబ్ మాలిక్ గురించి కూడా విషయాలను షేర్ చేస్తూ ఉండేది. అయితే ఏడాదిగా సానియా మీర్జా ఇన్‌స్టాలో షోయబ్ మాలిక్ ప్రస్తావన లేదు. చివరికి షోయబ్ మాలిక్‌కి గత ఏడాది ఫిబ్రవరిలో బర్త్ డే విషెస్ చెప్పింది సానియా మీర్జా... 
 

sania mirza

ఈ ఏడాది షోయబ్ మాలిక్‌ బర్త్ డే రోజున సానియా మీర్జా విషెస్ చెబుతూ ఒక్క పోస్టు చేయలేదు సరికదా, తన బర్త్ డేకి భర్త పెట్టిన విషెస్‌కి కూడా స్పందించలేదు. తాజాగా రంజాన్ మాసం సందర్భంగా తన ఇఫ్తాన్ విందు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సానియా మీర్జా..

ఈ వీడియోలో కొడుకు ఇజహాన్ మీర్జా మాలిక్‌తో కలిసి ఒంటరిగా ఇఫ్తార్ విందు ఆరగిస్తున్నట్టుగా ఉంది. ఎక్కడా షోయబ్ మాలిక్ కనిపించలేదు. ప్రస్తుతం షోయబ్ మాలిక్ ఏ క్రికెట్ టోర్నీలో బిజీగా కూడా లేడు. మరి మాలిక్ ఈ వీడియోలు ఎందుకు లేడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు..
 

షోయబ్ మాలిక్- సానియా మీర్జా కాపురంలో విభేదాలు రావడానికి పాక్ మోడల్, నటి అయేషా ఓమర్ కారణమని వార్తలు వచ్చాయి...  పాకిస్తాన్ నటి, మోడల్ అయేషా ఓమర్‌తో షోయబ్ మాలిక్ ఓ ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. ఈ ఫోటో షూట్‌లో షోయబ్ మాలిక్, అయేషాతో చాలా చనువుగా ఉండడం చూస్తుంటే వీరిద్దరి మధ్య రిలేషన్ బాగా దూరం వెళ్లిపోయిందని జోరుగా ప్రచారం జరిగింది..
 

స్విమ్మంగ్ పూల్‌లో అయేషా ఓమర్‌ను పట్టుకుని సరసాలు సాగించాడు షోయబ్ మాలిక్. సానియా మీర్జాతో విడాకుల విషయం బయటికి పొక్కడంతో ఈ ఫోటో షూట్ గురించి పెద్ద చర్చే జరిగింది.

మరి సానియా ఇఫ్తార్ పార్టీ వీడియోలో లేని షోయబ్ మాలిక్, అయేషా ఓమర్‌తో ప్రైవేట్ పార్టీలో ఉన్నాడేమోనని చాలామంది కామెంట్లు కూడా పెట్టడం విశేషం.. 

Latest Videos

click me!