ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్.. రాబోయే రెండు మూడేండ్లలో టీమిండియాకు కెప్టెన్ అవుతాడని, అందుకు గల లక్షణాలు సంజూలో పుష్కలంగా ఉన్నాయని అంటున్నాడు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్. ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత డివిలియర్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు.