సచిన్‌ కాదు కోహ్లీ కాదు - ప్రపంచంలో రిచెస్ట్ క్రికెటర్ ఎవరో తెలుసా?

First Published | Oct 15, 2024, 12:53 PM IST

Richest cricketer in the world: ప్రపంచంలో దిగ్గజ ప్లేయర్లు, ధనవంతులైన ఆటగాళ్ల లిస్టు గమనిస్తే అందులో చాలా మంది భారత క్రికెట్ ప్లేయర్లు ఉంటారు. టాప్ లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని అనుకుంటారు కానీ, ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ వీరు కారు. వీరిని మించి మరో భారత  ఆటగాడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్ గా నిలిచాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్రికెట్‌లో అత్యంత ధనవంతుడైన ప్లేయర్

Richest cricketer in the world: గుజరాత్ లో మాజీ రాజ కుటుంబానికి చెందిన రాజా శత్రుశల్యసింగ్ జడేజా తన అల్లుడు, మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను తన రాజ్యానికి వారసుడిగా ప్రకటించారు. భారత క్రికెట్ చరిత్రలో రంజీ, దులీప్ ట్రోఫీలకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఈ టోర్నమెంట్‌లకు పేరు పెట్టబడిన గొప్ప ఆటగాళ్లు నేరుగా గుజరాత్‌లోని జామ్‌నగర్ రాజ కుటుంబానికి చెందినవారు.

ఇదే రాజకుటుంబం, వీరి ప్రస్తుత వారసుడు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా. ఇప్పుడు  రాజ కుటుంబ‌ సింహాసనాన్ని అజయ్ జడేజాకు అప్పగిస్తున్నట్లు జామ్‌నగర్ రాజకుటుంబం ఇటీవల ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో అజయ్ జడేజా ప్రత్యేక స్థానం సంపాదించాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ గా  లెజెండరీ ప్లేయర్ల వెనక్కి నెట్టి టాప్ లోకి వచ్చాడు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్

ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక ఆస్తులున్న క్రికెటర్ పేర్లను ప్రస్తావిస్తే ఎక్కువగా వినిపించే పేర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని. ఇక విరాట్ కోహ్లీ దాదాపు 1090 కోట్ల రూపాయల ఆస్తితో ధనవంతులైన క్రికెటర్లలోఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం భారీగా సంపాదనలో ఉన్న టాప్ ప్లేయర్. బీసీసీఐ కేంద్ర ఒప్పందంతో పాటు ఐపీఎల్, సోషల్ మీడియా, వివిధ బ్రాండ్ ప్రకటనల ఒప్పందాలు, పలు వ్యాపారాలతో భారీగానే సంపాదిస్తున్నారు. 

ఇదే విధంగా ప్రపంచమంతా కొనియాడే భారత జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ నికర ఆస్తి 1040 కోట్ల రూపాయలు. అంతేకాకుండా, క్రికెట్ దేవుడుగా పిలువబడే సచిన్ టెండూల్కర్, ప్రపంచవ్యాప్తంగా 1390 కోట్ల రూపాయల ఆస్తితో ధనిక క్రికెటర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. కానీ, ఇప్పుడుడ అజయ్ జడేజా వీరందరినీ అధిగమించాడు. రిచెస్ట్ క్రికెటర్ గా మారాడు. 


ప్రపంచంలోని టాప్ 5 ధనవంతులైన క్రికెటర్లు

అజయ్ జడేజా ఆస్తుల విలువ కోహ్లీ, ధోనీ, సచిన్ టెండూల్కర్ ప్రస్తుత ఆస్తుల కంటే చాలా రెట్లు పెరిగింది. ఒక నివేదిక ప్రకారం మహారాజా అయిన తర్వాత జడేజా ఆస్తుల విలువ దాదాపు 1445 కోట్ల రూపాయలకు చేరుకుంది.

అతని కుటుంబంలో రాజా గ్రేట్ రంజిత్ సింగ్, దలీప్ సింగ్ ఇద్దరూ క్రికెట్ ఆటగాళ్ళు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, భారతదేశంలోని దేశీయ క్రికెట్‌లో రెండు టోర్నమెంట్‌లు ఈ ఇద్దరు మాజీ రాజుల పేరు మీదనే ఉండటం విశేషం. అజయ్ జడేజా ఆ 83 ఏళ్ల శత్రుశల్యసింగ్ స్థానంలో మహరాజుగా బాధ్యతలు తీసుకుంటున్నారు.

2024లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్

అతని కుటుంబ వారసత్వ ఆస్తిగా ఒక ప్యాలెస్, పాఠశాల, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగల సేకరణ ఉన్నాయి. జడేజా క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటికీ కామెంటరీ, ఇతర వ్యాపారాలతో చాలా డబ్బు సంపాదిస్తున్నారు.

ఐపీఎల్ మాత్రమే కాదు, అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. గత వన్డే ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు మార్గదర్శిగా కూడా వ్యవహరించారు. కానీ మార్గదర్శిగా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బోర్డు నుండి ఎలాంటి జీతం తీసుకోలేదు. దానిని అతను తిరస్కరించారు.

తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో జడేజా మొత్తం 15 టెస్ట్ మ్యాచ్‌లతో సహా 196 వన్డేల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. టెస్ట్ క్రికెట్‌లో మొత్తం 24 ఇన్నింగ్స్‌లలో సగటు 26.18తో  576 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 37.47 సగటుతో 5359 పరుగులు చేశారు.

అజయ్ జడేజా, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్

మహారాజా అయి సామాజిక ప్రభావం పెరిగినట్లే, ఈ స్టార్ క్రికెటర్ ఆస్తుల విషయంలో కూడా అందరినీ అధిగమించారు. కాగా, క్రికెట్ కెరీర్ చివరి దశలో అజయ్ జడేజా వివాదంలో చిక్కుకున్నారు. దాని తర్వాత చాలా కాలం పాటు క్రికెట్ మైదానం వెలుపల ఉన్నారు. ఇప్పుడు అదే జడేజా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన స్టార్ క్రికెటర్ అనే గౌరవాన్ని ఒక్క క్షణంలో పొందారు.

అజయ్ జడేజా తన కెరీర్ లో 6 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలతో దాదాపు 6,000 అంతర్జాతీయ పరుగులు సాధించాడు. ఇప్పుడు, అతని వారసత్వం క్రికెట్ గురించి మాత్రమే కాదు-రాజకీయంతో కూడా ముడిపడింది.

Latest Videos

click me!