‘సానియా మీర్జా- షోయబ్ మాలిక్ విడాకులు అయిపోయాయి!’ సానియాని ఛీట్ చేసిన మాలిక్...

First Published | Nov 10, 2022, 12:19 PM IST

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసేసుకున్నారా? ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ, మీర్జా- మాలిక్ విడాకుల తంతు అధికారికంగా పూర్తయిపోయిందనే వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కొన్నాళ్లుగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్ మధ్య సంబంధాలు చెడిపోయాయని, ప్రస్తుతం భారత మాజీ టెన్నిస్ స్టార్, కొడుకుతో కలిసి వేరుగా ఉంటోందని వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి షోయబ్ మాలిక్ చేసిన మోసమే కారణమని తెలుస్తోంది...

sania

పాక్‌లో ఓ టీవీ షోలో పాల్గొన్న షోయబ్ మాలిక్, అక్కడ ఓ యువతితో సంబంధం ఏర్పరచుకున్నాడని... ఆ విషయం సానియా మీర్జాకి తెలియడంతో గొడవ జరిగి, అది విడాకుల దాకా వెళ్లిందని సమాచారం. విడాకుల గురించి ఇటు సానియా మీర్జా కానీ, అటు షోయబ్ మాలిక్ కానీ స్పందించలేదు.


Image credit: Sania MirzaFacebook

అయితే షోయబ్ మాలిక్ మేనేజర్, పాక్ మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడిన మాటలు బయటికి వచ్చాయి. ‘అవును... సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసేసుకున్నారు. సెపరేషన్స్‌కి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తియిపోయాయి...’ అంటూ కామెంట్ చేశాడు మాలిక్ మేనేజర్... 

Sania

ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ ఇద్దరూ విడాకులు తీసుకునే ప్రసక్తి లేదని, ఇది ఏదో పుకారు అయి ఉంటుందని కొట్టి పారిసిన అభిమానులు... ఈ వార్త తెలిసి షాక్ అవుతున్నారు... ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ విడాకుల వార్త బయటికి పొక్కడం విశేషం.

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులకు 2018లో ఇజాన్ మీర్జా అనే కొడుకు పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాదిన్నర పాటు టెన్నిస్‌కి బ్రేక్ తీసుకున్న సానియా మీర్జా, కొడుకుతో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంది... 

ఈ ఏడాది టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించినసానియా మీర్జా, కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ ఫోటోల్లో ఎక్కడా షోయబ్ మాలిక్ కనిపించకపోవడం కూడా విడాకుల అనుమానాలకు మరింత ఊపందిస్తున్నాయి.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని ప్రేమించి పెళ్లాడింది. 2010లో పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరి కాపురం 12 ఏళ్ల పాటు సజావుగానే సాగింది. ఈ ఏడాది ఆరంభంలో కూడా భర్తతో కలిసి రీల్స్ చేస్తూ ఇన్‌స్టాలో సందడి చేసింది సానియా మీర్జా...    

Latest Videos

click me!