ఐసీసీ టోర్నీల్లో ఐపీఎల్ ఫార్ములా వాడితే బెటర్... టేబుల్ టాపర్స్‌కి మరో ఛాన్స్ ఉండాలంటున్న ఏబీడీ...

First Published | Nov 10, 2022, 10:51 AM IST

ఐసీసీ టోర్నీల్లో గ్రూప్ స్టేజీ దాటిన తర్వాత నాకౌట్ స్టేజీల్లో ఏ టీమ్‌కైనా మరో ఛాన్స్ ఉండదు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచుల్లో ఓడితే అక్కడి నుంచి ఇంటిదారి పట్టాల్సిందే. దీనిపై చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. మరోసారి ఏబీ డివిల్లియర్స్ కూడా దీనిపై మాట్లాడాడు...

Image credit: Getty

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరింది టీమిండియా. గ్రూప్ స్టేజీలో ఒకే ఒక్క మ్యాచ్ ఓడిన భారత జట్టు, 9 మ్యాచుల్లో ఏడు విజయాలు అందుకుంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది... 

Kane Williamson

ఆస్ట్రేలియా 7 విజయాలు, 2 ఓటములతో రెండో స్థానంలో నిలవగా, ఇంగ్లాండ్ 9 మ్యాచుల్లో 6 విజయాలు, 3 పరాజయాలతో మూడో స్థానంలో నిలిచింది. 9 మ్యాచుల్లో ఐదింట్లో గెలిచి, 3 మ్యాచుల్లో ఓడిన న్యూజిలాండ్ ( ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది)... పాక్‌ కంటే మెరుగైన రన్ రేట్‌తో సెమీస్ చేరింది...

Latest Videos


టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో ఓడి ఇంటిదారి పట్టింది. ఆ సమయంలోనే టేబుల్ టాపర్‌కి మరో ఛాన్స్ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అప్పటి టీమిండియా సారథి విరాట్ కోహ్లీ..

‘గ్రూప్ స్టేజీలో 7 మ్యాచుల్లో గెలిచాం. సెమీ ఫైనల్‌లో ఒకే మ్యాచ్‌తో మమ్మల్ని ఫైనల్ రేసు నుంచి తప్పించడం కరెక్టేనా. టేబుల్ టాపర్స్‌కి ఐపీఎల్‌లో లాగ మరో ఛాన్స్ ఇవ్వాలి. లేదంటే గ్రూప్ స్టేజీలో అన్ని మ్యాచులు గెలిచి లాభం ఏముంటుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ...

తాజాగా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ఐసీసీ టోర్నీల్లో కూడా ఐపీఎల్‌ ఫార్ములా ఫాలో అయితే బాగుంటుంది. గ్రూప్ స్టేజీలో మ్యాచులు బాగా జరుగుతున్నాయి. అయితే రెండు మ్యాచులతో ఫైనలిస్టులను డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు...

AB de Villiers

ఐపీఎల్‌లో లాగా క్వాలిఫైయర్స్, ఎలిమినేటర్ మ్యాచులు పెడితే ఐసీసీ టోర్నీలు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారతాయి... ఐసీసీ ఈ విషయం గురించి ఆలోచిస్తుందని అనుకుంటున్నా...’ అంటూ వ్యాఖ్యానించాడు ఏబీ డివిల్లియర్స్...

click me!