రోహిత్ శర్మ కెప్టెన్సీ అడిగాడా? బలవంతంగా కట్టబెట్టారా? షోయబ్ అక్తర్ అనుమానం...

First Published | Nov 12, 2022, 5:40 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టు సెమీస్‌లో ఓటమి పాలవ్వడంతో విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. ఆసియా కప్ పరాజయం తర్వాత భారత జట్టు పెద్దగా అంచనాలు లేకుండా వరల్డ్ కప్ టోర్నీని ఆరంభించినా... గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచి సెమీ ఫైనల్ చేరింది. అయితే ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో కనీస పోరాటం లేకుండా 10 వికెట్ల తేడాతో చేతులెత్తేసింది రోహిత్ సేన...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు టీ20 సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ... విరాట్ కోహ్లీ కేవలం టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా కావాలని... లేకపోతే టీ20 కెప్టెన్సీ కూడా చేయనని బీసీసీఐని, రోహిత్ శర్మ డిమాండ్ చేశాడని వార్తలు వినిపించాయి..

Rohit Sharma

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించింది బీసీసీఐ. ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన విరాట్, టెస్టు కెప్టెన్సీకి కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. 35 ఏళ్ల వయసులో మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారాన్ని మోయలేకపోయాడు రోహిత్ శర్మ...

Latest Videos


కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక గత ఏడాది కాలంలో రోహిత్ శర్మ మెజారిటీ టోర్నీలకు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది భారత జట్టు ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చింది. పదుల సంఖ్యలో ఓపెనర్లను మార్చింది. బౌలర్ల విషయంలోనూ అంతే...
 

Image credit: Getty

‘రోహిత్ శర్మ నిజంగా కెప్టెన్సీకి సిద్ధంగా ఉన్నాడా? అతను కెప్టెన్సీ అడిగాడా? లేక విరాట్ తప్పుకోవడంతో అతనికి బలవంతంగా కెప్టెన్సీ అప్పగించారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి. రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ కావాలనుకున్నాడని అందరికీ తెలుసు...

అయితే ముంబై ఇండియన్స్ జట్టును నడిపించినంత ఈజీ కాదు, టీమిండియా కెప్టెన్సీ. భారత జట్టు సారథిగా బాధ్యతలు తీసుకుంటే దానికోసమే బతకాలి, దాని గురించే ఆలోచించాలి. కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది...

Image credit: PTI

అయితే రోహిత్ శర్మ విషయంలో మాత్రం నాకు అలాంటివేమీ కనిపించలేదు. అతను కెప్టెన్ అయ్యాక చాలా మ్యాచుల్లో రెస్ట్ తీసుకున్నాడు. కెప్టెన్సీ చేసిన మ్యాచుల్లోనూ డిప్రెషన్‌కి లోనైనట్టు కనిపిస్తున్నాడు. నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ ఇంతకుముందులా లేడు...

Image credit: PTI

విరాట్, ధోనీ కెప్టెన్సీలో ఆడినప్పుడు రోహిత్ శర్మ చాలా ప్రెష్‌గా కనిపించేవాడు. నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. ఇప్పుడు రోహిత్‌లో ఆ నవ్వు ముఖం లేదు. కెప్టెన్సీతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి. బహుశా రోహిత్ దీన్ని అంచనా వేసి ఉండడు...

టీమ్ బాగా ఆడకపోతే ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అన్ని వేళ్లు తనవైపే చూపిస్తాయని రోహిత్ శర్మ ఊహించి ఉండడు. ఈ పరాజయం తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగుతాడని మాత్రం నాకు అనిపించడం లేదు. టీ20 ఫార్మాట్‌కే అతను రిటైర్మెంట్ ఇచ్చేస్తాడేమో...

Image credit: PTI

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వల్ల తానేం కోల్పోయాడో తెలుసుకోవడానికి చాలా సమయమే పట్టింది. అయితే ఆలస్యం కాకముందే ఆ భారాన్ని దించుకున్నాడు. రోహిత్‌కి అంత సమయం కూడా లేదు. అయితే ఎలాగైనా మునుపటి రోహిత్ శర్మను చూడాలని నేను కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్...
 

click me!