117 ఏంటి ఛీప్‌గా, నేను 130 మీటర్ల సిక్సర్ కొడతా...! ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రోవ్‌మెన్ పావెల్ కామెంట్...

Published : May 06, 2022, 04:56 PM IST

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 117 భారీ సిక్సర్ బాదాడు పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్... ఇప్పటిదాకా ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇదే లాంగెస్ట్ సిక్సర్. అయితే ఢిల్లీ బ్యాటర్ రోవ్‌మెన్ పావెల్ మాత్రం దీన్ని తలదన్నే సిక్సర్ కొడతానని అంటున్నాడు...

PREV
111
117 ఏంటి ఛీప్‌గా, నేను 130 మీటర్ల సిక్సర్ కొడతా...! ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రోవ్‌మెన్ పావెల్ కామెంట్...

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో 26 పరుగులు చేసిన రోవ్‌మెన్ పావెల్, కేకేఆర్‌తో మ్యాచ్‌లో 16 బంతుల్లో 33 పరుగులు చేసి ఇంప్రెస్ చేశాడు...

211

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 35 పరుగులు చేసిన రోవ్‌మెన్ పావెల్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు...

311

మొత్తంగా ఐపీఎల్ 2022 సీజన్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రోవ్‌మెన్ పావెల్, ఇప్పటిదాకా 10 మ్యాచుల్లో 9 ఇన్నింగ్స్‌ల్లో 171కి పైగా స్ట్రైయిక్ రేటుతో 202 పరుగులు చేశాడు. ఇందులో 18 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.
 

411

‘నేను 117 మీటర్ల సిక్సర్ మార్కును ఈజీగా బ్రేక్ చేయగలనని నమ్ముతున్నా. నేను మన్‌దీప్ సింగ్‌తో కూడా ఈ విషయం గురించి చెప్పా... ఈ సీజన్‌ ముగిసేలోపు 130 మీటర్ల సిక్సర్ కొడతానని చెప్పా... ఏమవుతుందో చూద్దాం...’ అంటూ కామెంట్ చేశాడు రోవ్‌మెన్ పావెల్...

511

అయితే టాప్ క్లాస్ బౌలర్లు పాల్గొనే ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 130 మీటర్ల సిక్సర్ ఎవ్వరూ కొట్టలేకపోయారు. 2008 సీజన్‌లో సీఎస్‌కే బ్యాటర్ అల్బీ మోర్కెల్ కొట్టిన 125 మీటర్ల సిక్స్‌యే ఇప్పటిదాకా ఐపీఎల్‌లో బిగ్గెస్ట్ సిక్స్‌గా ఉంది. 15 సీజన్లుగా ఈ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు...

611

టీమిండియా నుంచి 2010 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడిన భారత మాజీ ఫాస్ట్ బౌలర్ 2008 సీజన్‌లో 124 మీటర్ల సిక్సర్ బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద సిక్సర్.

711

లియామ్ లివింగ్‌స్టోన్ కొట్టిన 117 మీటర్ల సిక్సర్, ఓవరాల్‌గా ఐపీఎల్‌ చరిత్రలో 10వ లాంగెస్ట్ సిక్సర్. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం రెండు సార్లు 130+ మీటర్ల సిక్సర్లు నమోదయ్యాయి...

811

పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ 2013లో సౌతాఫ్రికాపై 153 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఇప్పటికీ ఈ రాకాసి సిక్సర్ క్రికెట్ ప్రపంచంలో ఓ వింతగా మిగిలిపోయింది.

911

ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ, 2005లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 130 మీటర్ల సిక్సర్ బాది, ఆఫ్రిదీ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఎవ్వరూ 130 మీటర్ల మార్కును టచ్ చేయలేకపోయారు...

1011

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 122 మీటర్ల సిక్సర్ బాది, టాప్ 4లో నిలిచాడు. 

1111

టీమిండియా నుంచి యువరాజ్ సింగ్, ఆస్ట్రేలియాపై 119 మీటర్ల సిక్స్ బాదగా, ఎమ్మెస్ ధోనీ, న్యూజిలాండ్‌పై 118 మీటర్ల సిక్సర్ కొట్టాడు...

click me!

Recommended Stories