వాళ్ల గురించి మాట్లాడతారు, కానీ వారితో మాట్లాడరు... విరాట్ కోహ్లీ పోస్టుపై సచిన్ టెండూల్కర్ కామెంట్...

First Published Feb 21, 2021, 3:17 PM IST

క్రికెట్‌లో ఎన్నో సంచలన రికార్డులు క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్, ఒక్క ట్వీట్ కారణంగా సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. రిహానా వేసిన ట్వీట్‌ కారణంగా ‘అంతర్గత వ్యవహారాల్లో బయటివారి జోక్యం సహించబోమంటూ’ సచిన్ వేసిన పోస్టు, ఆయన నెటిజన్లకు టార్గెట్ అయ్యేలా చేసింది....

అంతర్గత వ్యవహారాల విషయంపై జోక్యం సహించబోమంటూ వేసిన ట్వీట్‌కి వచ్చిన రియాక్షన్ కారణంగా కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు సచిన్ టెండూల్కర్.
undefined
దాదాపు 15 రోజుల గ్యాప్ తీసుకుని, రెండో టెస్టు విజయం అనంతరం ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్... మళ్లీ తనదైన స్టైల్‌లో ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉండడం మొదలెట్టాడు...
undefined
2014 ఇంగ్లాండ్‌ టూర్‌లో బ్యాట్స్‌మెన్‌గా ఫెయిల్ అయిన తర్వాత తాను తీవ్రమైన డిప్రెషన్‌కు లోనయ్యానంటూ భారత సారథి విరాట్ కోహ్లీ వెల్లడించిన విషయం తెలిసిందే... అలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి సచిన్ టెండూల్కర్ ఎంతో సహకరించాడని కోహ్లీ చెప్పాడు...
undefined
‘2014 ఇంగ్లాండ్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యాను. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోకా. దాంతో నా పని అయిపోయిందని అనిపించింది. ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరు, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు... అనే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా...
undefined
ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ నాతో మాట్లాడారు... ‘నీ మెంటల్ కండిషన్ నేను అర్థం చేసుకోగలను. నీలో నెగిటివ్ ఆలోచనలు చాలా పెరిగిపోతున్నాయి.... అది మంచిదే, కానీ వాటిని అలా వెళ్లిపోనివ్వకు...
undefined
ఆ ఆలోచనలతో నువ్వు ఫైటింగ్ చేయడం మొదలెడితే, మానసికంగా దృఢంగా మారతావు... ’ అంటూ సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సలహా నేను తీసుకున్నాను. అప్పటి నుంచి నా ఆలోచన విధానమే మారిపోయింది...’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...
undefined
విరాట్ కోహ్లీ ఇచ్చిన ‘నాట్ జస్ట్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌పై కామెంట్ చేశాడు సచిన్ టెండూల్కర్...‘విరాట్ కోహ్లీ నీ విజయాన్ని, అంతకుమించి నువ్వు ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోవాలని నిర్ణయించుకోవడాన్ని చూసి నేనెంతో గర్విస్తున్నాను...
undefined
ఈరోజుల్లో యువకుల సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు. కొన్ని వేల మంది యువతరం గురించి మాట్లాడతారు, కానీ ఎవ్వరూ వారితో మాట్లాడడం లేదు...
undefined
మనం వాళ్లు చెప్పేదాన్ని వినాలి, అప్పుడు వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు సాయం చేసేందుకు వీలు అవుతుంది...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్...
undefined
తాజాగా టీ20 సిరీస్‌కు ఎంపికైన ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియా, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్... ‘ఏ క్రికెటర్‌కైనా దేశానికి ఆడడమే అతి గొప్ప గౌరవం’ అంటూ ట్వీట్ చేసిన టెండూల్కర్, యువక్రికెటర్ల విజయం సాధించాలని ఆకాంక్షించారు.
undefined
click me!