సచిన్ టెండూల్కర్ సాధించిన, క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పాలంటే పుస్తకాలు రాస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. భారత జట్టు ఇప్పటిదాకా టెస్టు సిరీస్ గెలవని సఫారీ గడ్డపై కూడా సచిన్ టెండూల్కర్‌కి ఓ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది...
2010-11 సౌతాఫ్రికా టూర్‌లో సచిన్ టెండూల్కర్, 3 టెస్టుల్లో 6 ఇన్నింగ్స్‌ల్లో 81.50 సగటుతో 326 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 146 పరుగులు...
211
సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాపై టెస్టుల్లో 300+ పరుగులు చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా నిలిచాడు సచిన్ టెండూల్కర్...
311
అంతేకాకుండా 712 బంతులను ఎదుర్కొన్న సచిన్, సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌లో 700+ బంతులను ఎదుర్కొన్న ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గానూ ఉన్నాడు..
411
Sachin Tendulkar
37 ఏళ్ల వయసులో డేల్ స్టెయిన్, మార్కెల్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ ఈ ఫీట్ సాధించాడు సచిన్ టెండూల్కర్... విరాట్ కోహ్లీ గత పర్యటనలో సచిన్ టెండూల్కర్‌కి దగ్గరగా వచ్చాడు...
511
2017-18 సఫారీ టూర్‌లో విరాట్ కోహ్లీ 3 మ్యాచుల్లో 47.66 సగటుతో 475 బంతుల్లో 286 పరుగులు చేశాడు. అయితే 300+ పరుగులకు 14 పరుగుల దూరంలో నిలిచాడు...
611
అంతకుముందు 2013-14 టూర్‌లో ఛతేశ్వర్ పూజారా 2 మ్యాచుల్లోనే 280 పరుగులు చేశాడు. 600 బంతులు ఎదుర్కొన్న పూజారా, 70 సగటుతో పరుగులు చేసినా సచిన్ రికార్డును అందుకోలేకపోయాడు.
711
1996-97 సౌతాఫ్రికా పర్యటనలో రాహుల్ ద్రావిడ్, మూడు టెస్టుల్లో 693 బంతులను ఎదుర్కొని 277 పరుగులు చేశాడు...
811
విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్‌ను లెక్కలోకి తీసుకుంటే ఈసారి పర్యటనలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన 300+ పరుగులను అందుకోవడం కష్టమే...
911
కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌తో పాటు ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ వంటి క్రికెటర్లతో ఎవ్వరు సచిన్ ఫీట్‌ను బద్ధలుకొడతారో చూడాలి...
1011
గత పర్యటనలో 2-1 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత జట్టు, ఈసారి ఎలాగైనా సిరీస్ గెలవాలనే ఉద్దేశంతో బరిలో దిగనుంది.
1111
ఈ టెస్టు సిరీస్‌కి ముందు రోహిత్ శర్మ గాయపడడంతో అతని స్థానంలో కెఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...