సచిన్ టెండూల్కర్... అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని, దాదాపు 8 ఏళ్లు దాటిపోయింది. ఈ మధ్యకాలంలో రోహిత్ శర్మ, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీల రూపంలో క్రికెట్ ప్రపంచంలో సరికొత్త స్టార్లు పుట్టుకొచ్చారు. అయితే సచిన్ స్థాయి మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు...
తాజాగా యూగోవ్ అనే ఇంటర్నెట్ మార్క్ రిసెర్చ్, డేటా అనాలిటిక్స్ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో ‘మోస్ట్ అడ్మైర్డ్ మ్యాన్’గా ప్రపంచంలోనే 12వ స్థానాన్ని దక్కించుకున్నాడు సచిన్ టెండూల్కర్...
29
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 38 దేశాల్లో ఉన్న వివిధ నగరాల నుంచి దాదాపు 42 వేల మంది అభిప్రాయాలను సేకరించి, ఈ సర్వే నిర్వహించింది యూగోవ్...
39
ఇందులో ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో తర్వాత మూడో స్పోర్ట్స్ పర్సన్‌గా అత్యధిక ఓట్లు సాధించాడు ‘లిటిల్ మాస్టర్’, ‘భారతరత్న’ సచిన్ టెండూల్కర్...
49
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌తో పాటు భారత ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానాల్లో నిలవడం విశేషం...
59
పాక్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టీమిండియా నయా వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మలకు ఈ పోల్‌లో చెప్పుకోదగ్గ ఓట్లు కూడా రాకపోవడం విశేషం...
69
ఈ ఏడాది ఆరంభంలో హాలీవుడ్ పాప్ సింగర్ రిహానా, రైతుల ఉద్యమం గురించి వేసిన ట్వీట్‌పై ‘అంతర్గత వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యాన్ని సహించం’ అంటూ స్పందించి, విమర్శలు ఎదుర్కొన్నాడు సచిన్ టెండూల్కర్...
79
అయితే భారత క్రికెటర్లతో పాటు సచిన్ టెండూల్కర్ ట్వీట్‌లోని అసలు అంతర్యాన్ని గ్రహించిన చాలా మంది నెటిజన్లు, ఆయనకు సపోర్టుగా నిలిచారు...
89
దీనితో పాటు దాదాపు దశాబ్దం కిందటే యూనిసెఫ్ (UNICEF) సంస్థతో చేతులు కలిపిన సచిన్ టెండూల్కర్, ఎన్నో సామాజికాభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. అలాగే 2013లో యూనిసెఫ్ సౌత్ ఆసియా బ్రాండ్ అంబాసిడర్‌గానూ ఉన్నాడు...
99
బాలికల విద్య, ఆరోగ్యం, క్రీడాభివృద్ధి వంటి ఎన్నో సాంఘిక, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సచిన్ టెండూల్కర్, క్రికెట్ ప్రపంచంలో నూరు సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే...