అమ్మ కంగారూలూ.. ఎంతకు తెగించార్రా! ఇక్కడ కాంట్రాక్టు ముగియకముందే అక్కడికి..

Published : Apr 24, 2023, 04:59 PM ISTUpdated : Apr 24, 2023, 05:03 PM IST

IPL 2023: ఐపీఎల్ ప్లేఆఫ్స్  మొదలయ్యాక పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు  భారత్ ను వీడనున్నారని తెలుస్తున్నది.   ఈ మేరకు  క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇదివరకే  ఆసీస్ క్రికెటర్లకు  సమాచారం అందించిందని సమాచారం.

PREV
18
అమ్మ కంగారూలూ.. ఎంతకు తెగించార్రా! ఇక్కడ కాంట్రాక్టు ముగియకముందే  అక్కడికి..
Image credit: PTI

గతనెలలో మొదలైన ఐపీఎల్-16  ఫస్టాప్  ఎండింగ్ కు వచ్చింది.   ఇప్పటికే పలు జట్లు ఏడు మ్యాచ్ లను పూర్తి చేశాయి.  ఇకనుంచి  ఆడే ప్రతీ మ్యాచ్  ఫ్రాంచైజీలకు కీలకమే.  లీగ్ దశ ముగిసిన తర్వాత  మే  23 నుంచి  ఐపీఎల్ ప్లేఆఫ్స్ మొదలుకానున్నాయి.  అయితే ప్లేఆఫ్స్  సమయంలో పలువురు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది.

28
Image credit: PTI

ఐపీఎల్ ప్లేఆఫ్స్  మొదలయ్యాక పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు  భారత్ ను వీడనున్నారని తెలుస్తున్నది.   ఈ మేరకు  క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇదివరకే  ఆసీస్ క్రికెటర్లకు  సమాచారం అందించిందని..  మే 20 తర్వాత    ఇంగ్లాండ్ కు  చేరుకోవాలని   ఆదేశించినట్టు తెలుస్తున్నది.  ఇదివరకు మార్నస్ లబూషేన్ తో పాటు మరికొందరు ఆసీస్ క్రికెటర్లు ఇంగ్లాండ్  చేరుకుని  ఇక్కడ కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. తద్వారా మంచి మ్యాచ్ ప్రాక్టీస్ పొందుతున్నారు.

38
Image credit: PTI

జూన్ 7 నుంచి  ఇంగ్లాండ్ లోని  ‘ది ఓవల్’ వేదికగా భారత్ - ఆస్ట్రేలియాల మధ్య  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది.   అయితే మే 28కే ఐపీఎల్ ముగిసినా ఇందుకు  మరో  వారం రోజుల గ్యాప్ కూడా ఉంటుంది.  కానీ డబ్ల్యూటీసీ  ఫైనల్  టీమ్ లో ఉన్న  క్రికెటర్లు (ఐపీఎల్ లో ఆడుతున్నవారు)  పదిహేను రోజుల ముందుగానే అక్కడకి చేరుకోవాలని  సీఏ ఆదేశించినట్టు సమాచారం.  

48
Image credit: PTI

ప్రస్తుతానికి ఐపీఎల్ లో ఆడుతున్న  ఆస్ట్రేలియా క్రికెటర్లలో  డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (ఢిల్లీ క్యాపిటల్స్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ హెజిల్‌వుడ్ (ఆర్సీబీ), కామెరూన్  గ్రీన్, టిమ్ డేవిడ్  (ముంబై ఇండియన్స్)  లు  కీ ప్లేయర్స్. వీరిలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు  కామెరూన్ గ్రీన్, జోష్ హెజిల్వుడ్, డేవిడ్ వార్నర్,  మిచెల్ మార్ష్.   వీరంతా ప్లేఆఫ్స్ షెడ్యూల్ కు అందుబాటులో ఉండేది అనుమానమేనట.

58
Image credit: PTI

వాస్తవానికి ఐపీఎల్ -16లో ఇంకా ప్లేఆఫ్స్   చేరే జట్లపై స్పష్టత లేదు.  ప్రస్తుత టీమ్స్  జోరు చూస్తే  సీఎస్కే, గుజరాత్,  రాజస్తాన్,  ఆర్సీబీ,  ముంబై  లతో పాటు పంజాబ్ కింగ్స్ కూడా పోటీలో ఉన్నాయి.    ఢిల్లీ  క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ఆశలు  అది ఆడే తర్వాత అన్ని మ్యాచ్ లను గెలిచినా మిగిలిన జట్ల మీద ఆధారపడాల్సిందే.  సన్ రైజర్స్, కేకేఆర్ లకు కూడా అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

68
Image credit: PTI

అయితే ముంబై, ఆర్సీబీలలో ఆడే గ్రీన్,  హెజిల్‌వుడ్  లు వారి జట్లు  ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తే ఆడటం అనుమానమే. ఢిల్లీ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ మాత్రం మందు వెళ్లే అవకశాలున్నాయి.   ముంబై   ప్లేఆఫ్స్ కు వెళ్లి గ్రీన్ లేకుంటే అది ఆ జట్టు విజయావకాశాల మీద  ప్రభావం చూపేదే. 

78
Image credit: PTI

ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ప్లేఆఫ్స్ కు అందుబాటులో ఉండనని ఇప్పటికే  సీఎస్కే యాజమాన్యానికి చెప్పాడట. ఈ విషయాన్ని  సీఎస్కే వర్గాలు కూడా  ధ్రువీకరిస్తున్నాయి.  అసలే గాయంతో  మ్యాచ్ లు ఆడలేక బెంచ్ కే పరిమితమవుతున్న  స్టోక్స్..  ఐపీఎల్  అయిపోకముందే ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు.
 

88

డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత  ఆస్ట్రేలియా జట్టు  ఇంగ్లాండ్ తో యాషెస్ సిరీస్ ఆడనున్నది. దీనికోసం  ముందస్తు సన్నాహకాల్లో భాగంగా స్టోక్స్.. సీఎస్కేను వీడనున్నాడని తెలుస్తున్నది. మరి స్టోక్స్ పోతే  సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్స్ కూడా టీమ్ తో ఉంటాడా..? ముందే వెళ్తాడా..? అనే దానిపై స్పష్టత లేదు.

click me!

Recommended Stories