సచిన్ టెండూల్కర్ వర్సెస్ విరాట్ కోహ్లీ... ఇద్దరి మధ్యా ఇన్ని పోలికలా...

First Published Nov 5, 2020, 5:49 PM IST

IPL 2020: నేడు ప్రపంచంలో చాలామంది క్రికెట్ చూడడానికి ప్రధాన కారణం సచిన్ టెండూల్కర్. కెరీర్ ఆరంభంలో దూకుడుకి మారుపేరిన నిలిచిన సచిన్, ఆ తర్వాత క్రికెట్ చరిత్రలోనే అనితర సాధ్యమైన రికార్డులెన్నో తన పేరిట లిఖించుకున్నాడు. 2008లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, కొద్దిరోజుల్లోనే సచిన్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న రికార్డులు బద్ధలుకొట్టడం ఎవ్వరివల్లైనా అవుతుందంటే... అది ఒక్క విరాట్ కోహ్లీయే. అయితే ఈ  ఇద్దరు క్రికెట్ లెజెండ్స్ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. అవేంటంటే...

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన రోజు 18. సచిన్ టెండూల్కర్ డిసెంబర్ 18, 1989న పాకిస్థాన్‌పై క్రికెట్ ఆరంగ్రేటం చేస్తే... విరాట్ కోహ్లీ 18, ఆగస్టు 2008న శ్రీలంకపై ఆరంగ్రేటం చేశాడు.
undefined
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా తమ 14వ టెస్టు ఇన్నింగ్స్‌లోనే తొలి టెస్టు సెంచరీ నమోదుచేశారు....
undefined
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ వరల్డ్ కప్‌లో తమ మొదటి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును పాకిస్థాన్‌పైనే సాధించారు.
undefined
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన కెప్టెన్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీయే.
undefined
సచిన్ టెండూల్కర్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి మొదటి టెస్టు సెంచరీ సాధిస్తే, విరాట్ కోహ్లీ కూడా ఆరోస్థానంలో మొట్టమొదటి శతకాన్ని నమోదుచేశాడు.
undefined
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కెప్టెన్లుగా వన్డేల్లో మొదటి మ్యాచ్‌ శ్రీలంకపై ఆడితే... టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఆడారు.
undefined
సచిన్ టెండూల్కర్ నవంబర్ 26న టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధిస్తే, విరాట్ కోహ్లీ కూడా నవంబర్ 26నే టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదాడు...
undefined
సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో తన నాలుగో డబుల్ సెంచరీ బంగ్లాదేశ్‌పై, ఐదో డబుల్ సెంచరీ శ్రీలంకపై చేశారు. విరాట్ కోహ్లీ కూడా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ చేశాడు.
undefined
సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్‌లో 58వ సెంచరీ ఇంగ్లాండ్‌పై సాధించాడు. విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్‌పై తన 58వ శతకం బాదాడు. ఇందులో మరీ విచిత్రం ఏంటంటే... ఇద్దరూ కూడా 197 బంతుల్లో 103 పరుగులు చేశారు. ఆడిన బంతులు, చేసిన పరుగులు కూడా సేమ్ టు సేమ్.
undefined
సచిన్ టెండూల్కర్ తన ఆరో టెస్టు సెంచరీ ఆస్ట్రేలియాలో సాధించగా... కింగ్ కోహ్లీ కూడా ఆసీస్ గడ్డపైనే ఆరో శతకం బాదాడు.
undefined
సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 3 వేల పరుగుల మైలురాయిని శ్రీలంకపై అందుకున్నారు. విరాట్ కోహ్లీ కూడా శ్రీలంకపైనే ఈ ఫీట్ సాధించాడు.
undefined
సచిన్ టెండూల్కర్ వాంఖడే స్టేడియంలో 4000 టెస్టు పరుగుల మైలురాయి అందుకుంటే, విరాట్ కోహ్లీ కూడా ఇదే మైదానంలో ఈ ఫీట్ అందుకున్నాడు.
undefined
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా తమ మొట్టమొదటి వన్డే హాఫ్ సెంచరీని శ్రీలంకపై నమోదుచేశారు.
undefined
వన్డేల్లో సచిన్ టెండూల్కర్ సెంచరీతో 10 వేల మైలురాయిని అందుకుంటే, విరాట్ కోహ్లీ కూడా 10 వేల మైలురాయి అందుకున్న మ్యాచ్‌లో సెంచరీ చేశాడు.
undefined
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా తమ 60వ అంతర్జాతీయ సెంచరీని వెస్టిండీస్‌పైనే నమోదుచేశారు.
undefined
న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీలు బాదిన భారత కెప్టెన్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాత్రమే. మిగిలిన కెప్టెన్లు ఎవ్వరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు.
undefined
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా ఐపీఎల్‌లో తమ మొట్టమొదటి సెంచరీనీ ఆఖరి బంతికి అందుకున్నారు. ఇద్దరూ చేసిన మొదటి సెంచరీ స్కోరు 100 నాటౌట్.
undefined
ఆస్ట్రేలియపై 1000 టెస్టు పరుగులు అందుకున్న సమయంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీకి ఒకే వయసు, మ్యాచ్ జరిగిన ప్రదేశం కూడా ఒకటే.
undefined
ఇంగ్లాండ్‌పై సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ డిసెంబర్ 15న సెంచరీ చేశారు. ఇద్దరూ కూడా 103 పరుగుల వద్ద అవుట్ అయ్యారు.
undefined
సచిన్ టెండూల్కర్ చేసిన మొదటి 50 సెంచరీల్లో 22 సెంచరీలు ఆస్ట్రేలియా, శ్రీలంకపైనే వచ్చాయి. విరాట్ కోహ్లీ కూడా సేమ్ టు సేమ్ సీన్ కాపీ చేశాడు.
undefined
సచిన్ టెండూల్కర్ ఐపీఎల్‌లో 2 వేల పరుగులను రాజస్థాన్ రాయల్స్‌పై జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో అందుకుంటే, విరాట్ కూడా రాజస్థాన్‌పై జైపూర్‌లోనే 2 వేల ఐపీఎల్ పరుగులను చేరుకున్నాడు.
undefined
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఆసియా కప్‌లో మొదటి సెంచరీ చేయడానికి 5 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. ఇద్దరూ శ్రీలంకపైనే ఈ ఫీట్ సాధించారు.
undefined
click me!