నేను బాగా ఆడుతున్నా, అవుట్ అవ్వాలని కోరుకునేవాళ్లు! ఈ సచిన్ ఫ్యాన్స్ ఉన్నారే... - రాహుల్ ద్రావిడ్

First Published Mar 16, 2023, 3:54 PM IST

ఇండియాలో ఓ క్రికెటర్‌గా స్టార్‌గా ఆరాధించడం, దేవుడిగా కీర్తించడం మొదలైంది సచిన్ టెండూల్కర్‌తోనే... సచిన్ అవుటైతే, మ్యాచ్ గెలిచినట్టేనని ఫిక్స్ అయిపోయేవాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లు. ప్రత్యర్థి టీమ్స్ మాత్రమే కాదు, సొంత టీమ్ మేట్స్ కూడా టెండూల్కర్ అవుటైతే మ్యాచ్ పోయినట్టేనని ఫిక్స్ అయ్యేవాళ్లంటే ‘మాస్టర్’ ముద్ర ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు...
 

Sachin Tendulkar

తాజాగా సచిన్ టెండూల్కర్ టీమ్ మేట్, టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, మాస్టర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు... ‘టీమ్‌లో ఉన్న స్టార్ ప్లేయర్లపై అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉంటాయి. సచిన్ టెండూల్కర్‌తో బ్యాటింగ్ చేసేటప్పుడు ఇది నాకు అనుభవం అయ్యింది...

కెరీర్ ఆరంభంలో నేను బాగా ఆడుతున్నా సరే, త్వరగా అవుట్ అవ్వాలని జనాలు కోరుకునేవాళ్లు. ఆ విషయం నాకు తెలిసి ఆశ్చర్యమేసింది. ప్రత్యర్థి టీమ్ ఫ్యాన్స్, నేను త్వరగా అవుట్ అవ్వాలని కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ టీమిండియా ఫ్యాన్స్ కూడా నేను త్వరగా అవుటైతే బాగుండని ఎదురుచూసేవాళ్లు...

Latest Videos


నేను అవుటైతే, సచిన్ టెండూల్కర్ క్రీజులోకి వస్తాడని, అతని బ్యాటింగ్ చూడవచ్చని అనుకునేవాళ్లు. టీమిండియా గెలవడం కంటే సచిన్ టెండూల్కర్ బాగా ఆడి గెలిపించాలని కోరుకునేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండేది. అభిమానుల ఆలోచనా విధానం అలాగే ఉంటుంది...

ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. అభిమానులు, ప్రతీ మ్యాచ్‌లోనూ సెంచరీ చేయాలని అనుకుంటారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ సెంచరీలు చేయడంలో ఓ స్టాండర్డ్ సెట్ చేశారు. సెంచరీలు చేయడం ఇంత తేలిక అన్నట్టుగా మోత మోగించారు...
 

అలా సెంచరీల మీద సెంచరీలు కొట్టేసరికి, కొన్ని రోజులు సెంచరీ చేయడానికి కష్టపడితే.. తెగ ఫీలైపోయేవాళ్లు. ఇలాంటి అభిమానుల వల్ల ప్లేయర్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒకానొక దశలో సచిన్ టెండూల్కర్ కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు... సచిన్ ప్రెషర్‌ని నేను దగ్గర్నుంచి చూశాను...

కుర్రాళ్లు, సచిన్, విరాట్ నుంచి చాలా నేర్చుకోవాలి. నేను ఇలాగే ఆడాలి, ఇది నా స్టైల్ అని మొండిగా ఒకే లైన్‌లో వెళ్తానంటే అన్ని సార్లు కుదరదు. కొన్ని సార్లు టెక్నిక్ కంటే ఓపిక చాలా అవసరం అవుతుంది. ఈ రెండూ సచిన్ టెండూల్కర్‌లో, విరాట్ కోహ్లీలో ఉన్నాయి. అందుకే వాళ్లు ఇన్ని సెంచరీలు చేయగలిగారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...

click me!